Visakha Agency Bandh : జగన్ నిర్ణయంపై నిరసన-బంద్ పాటిస్తున్న విశాఖ మన్యం..!
ఏపీలో గిరిజనేతరులైన బోయవాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానం ఇప్పుడు మన్యంలో కాక రేపుతోంది. వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇవాళ విశాఖ మన్యంలో గిరిజనులు, ఆదివాసీలు బంద్ పాటిస్తున్నారు. ఈ నిరసనలు మరింత పెరిగితే రాబోయే రోజుల్లో వైసీపీ ఓటు బ్యాంక్ పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ మార్చి 24న అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం కీలక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఈ తీర్మానం అసెంబ్లీలో ఆమోదించారు.దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు గిరిజనుల నుంచి సెగ మొదలైంది.
అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకించింనందుకు వీరంతా బాధ్యత వహించాలని, 5 నుంచి 6 షెడ్యూల్లు, 1/70 కింద వచ్చిన హక్కుల పరిరక్షణకు కట్టుబడాలనే డిమాండ్లతో ఆదివాసీ సంఘాలు ఇవాళ బంద్ కు పిలుపునిచ్చాయి. దీనికి మావోయిస్టులూ మద్దతిస్తున్నారు.

ఏపీ గిరిజన సంఘం పిలుపు మేరకు మన్యంలో సాగుతున్న బంద్ కు విపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. దీంతో ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ నిలిపేశారు. దుకాణాలు, వ్యాపార సముదాయాలను స్వచ్చందంగా మూసేశారు. బోయ వాల్మీకిలపై ఉన్న శ్రద్ధ.. జీఓ నెంబర్ 3 అమలుపై ఎందుకు లేదని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆదివాసీ సంఘాల బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
జగన్ నిర్ణయంపై నిరసన-బంద్ పాటిస్తున్న విశాఖ మన్యం..!!#VisakhaAgencyBandh #YSJagan #CMjagan #AndhraPradesh #YSRCPGovt #YSJaganRegime #Oneindiatelugu pic.twitter.com/FmuBY8Ww2B
— oneindiatelugu (@oneindiatelugu) March 31, 2023
గతంలో ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు, లీజులు రద్దు చేసిన జగన్ సర్కార్ కు ఆ మేరకు మద్దతు పెరిగింది. కానీ ఇప్పుడు అదే గిరిజనులకు అన్యాయం చేసేలా ఇతర కులాల్ని ఎస్టీల్లో చేరుస్తున్నారంటూ ఆందోళనలు సాగుతున్నాయి. దీంతో అసెంబ్లీలో సీఎం జగన్ ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామంటూ చేసిన వ్యాఖ్యల ప్రభావం గిరిజనులపై ఏమాత్రం లేదని అర్ధమవుతోంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications