వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ ఉక్కు ఉద్యమం: కొనసాగిన బంద్; పవన్ కళ్యాణ్, బీజేపీపై మంత్రి అవంతి ఫైర్

|
Google Oneindia TeluguNews

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై సోమవారం నాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు విశాఖ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆందోళనలు మిన్నుముట్టాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయకూడదని, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మ వద్దని అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మద్దెలపాలెం దగ్గర రాస్తారోకో నిర్వహించారు. రిలే దీక్షలతో పాటు పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

కేంద్రమంత్రి వ్యాఖ్యలకు భగ్గుమన్న విశాఖ ఉక్కు కార్మికులు, బైక్ ర్యాలీలతో నిరసనకేంద్రమంత్రి వ్యాఖ్యలకు భగ్గుమన్న విశాఖ ఉక్కు కార్మికులు, బైక్ ర్యాలీలతో నిరసన

 విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం .. బంద్; అఖిల పక్షాల రాస్తారోకో

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం .. బంద్; అఖిల పక్షాల రాస్తారోకో


మద్దెలపాలెం కూడలి వద్ద నిరసన తెలిపిన అఖిలపక్ష పార్టీల నేతలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్రంలోని బిజెపి సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకో ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులు ధర్నా చేస్తున్న వామపక్ష పార్టీల కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 గాజువాకలోనూ కార్మిక సంఘాల ర్యాలీ .. కేంద్రం తీరుపై ఆగ్రహం

గాజువాకలోనూ కార్మిక సంఘాల ర్యాలీ .. కేంద్రం తీరుపై ఆగ్రహం


ఇక గాజువాక నుండి సిపిఎం నేతలు, కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రుల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మే హక్కు ఎవరికీ లేదని వారు స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని కార్మిక సంఘాల నేతలు తేల్చి చెప్పారు.

 స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడాలి : మంత్రి అవంతి శ్రీనివాస్

స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడాలి : మంత్రి అవంతి శ్రీనివాస్


ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కార్మికులు నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర బీజేపీ నేతలు, పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని, స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. విభజన చట్టంలో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలను బీజేపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోతే, బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉండదని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలి : మంత్రి అవంతి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలి : మంత్రి అవంతి


విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర వైఖరి రాష్ట్ర బీజేపీ కి దెబ్బ అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవమైన స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం వెనక్కు తగ్గాలని పేర్కొన్న మంత్రి, ఢిల్లీలోని పెద్దలకు స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై సమాచారాన్ని చేరవేయడంలో బీజేపీ నేతల లోపం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలని పేర్కొన్న మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రజల మంచితనాన్ని అసమర్థత గా తీసుకోవద్దంటూ పేర్కొన్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలతో సంతకాల సేకరణ: మంత్రి అవంతి

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలతో సంతకాల సేకరణ: మంత్రి అవంతి


స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 110 మంది ఎంపీలతో సంతకాల సేకరణ చేయనున్నట్టు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం వైసిపి పోరాటం చేస్తుందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు కార్మికుల పక్షాన నిలిచి తమ గళాన్ని వినిపిస్తుందని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

English summary
The bandh continued in protest of the Centre's stance on the privatization of the Visakhapatnam steel plant. Minister Avanti Srinivas visited the workers' initiation camp, said Pawan Kalyan, BJP leaders should put pressure on the Center for steel plant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X