జలపాతంలో పడి విశాఖ యువకుడి చండీగఢ్‌లో మృతి

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ యువకుడు చండీగఢ్‌లో అకాల మృత్తువు పాలయ్యాడు. విశాఖపట్నం జిల్లా చోడవం మండలం పిఎస్ పేట గ్రామానికి చెందిన యువకుడు చండీగఢ్‌లోని ఓ జలపాతంలో పడి మరణించాడు. ఈ ఘటన ఆదివారంనాడు జరిగింది.

పిఎస్ పేట గ్రామానికి చెందిన కూనిశెట్టి కుమార్ (21) చండీగఢ్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారంనాడు ఓ జలపాతం చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ సమాచారాన్ని వాయుసేన విభాగం అధికారులు ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులకు తెలిపారు. సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయానికి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించనున్నట్లు సమాచారం.

Visakha boy died in Chandigarh

ఇదిలావుంటే, గుంటూరు జిల్లా శావల్యాపురం వద్ద జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఓ జీపు అదుపు తప్పి వంతెనపై నుంచి కిందికి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రకాశం జిల్లా కంభం నుంచి జీపులో గోదావరి పుష్కరాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కటకం బ్రహ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, జీపులో మరో ఇద్దరు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు వారిని వినుకొండ ఆస్పత్రికి తరలించారు. వారిలో పూజిత అనే యువతు చికిత్స పొందుతూ మరణించింది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పరారయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+