Visakha Garjana : భారీవర్షంతో ఆలస్యంగా మొదలైన విశాఖ గర్జన-భారీ ర్యాలీ, డప్పులు, నృత్యాలు
విశాఖలో మూడు రాజధానులకు మద్దతుగా నాన్-పొలిటికల్ జేఏసీ సాయంతో అధికార వైసీపీ నిర్వహిస్తున్న భారీ ర్యాలీ ప్రారంభమైంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం ఉదయానికి కూడా తగ్గలేదు. దీంతో ఎక్కడెక్కడి నుంచో ఈ గర్జనలో పాల్గొనేందుకు వచ్చిన జనం ఇబ్బందులు పడ్డారు. నగరంలోని ర్యాలీ ప్రారంభ వేదిక అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకునేందుకు వైసీపీ నేతలు, జనం ఆలస్యంగా వచ్చారు.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన విశాఖ గర్జన ర్యాలీ వర్షాల కారణంగా దాదాపు గంటన్నర సేపు ఆలస్యంగా మొదలైంది. అయినా భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలతో ర్యాలీ సందడిగా మారింది. అధికార వైసీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేతలంతా భారీగా హాజరయ్యారు. నగరంలో ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ర్యాలీ సాగే అంబేద్కర్ విగ్రహం-వైఎస్సార్ విగ్రహం రూట్ లో ఇతర వాహనాల్ని అనుమతించడం లేదు.

విశాఖలో వైసీపీ గర్జన నేపథ్యంలో ర్యాలీ పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. డప్పు కళాకారులు, నృత్యాలతో ర్యాలీ సందడిగా సాగుతోంది. విశాఖ గర్జన కోసం వైసీపీ భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టింది. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి మంత్రుల్ని, నేతల్ని, కార్యకర్తల్ని భారీగా తరలించింది. దీంతో వైసీపీ నేతలు భారీగా తరలివచ్చారు. స్ధానిక ప్రజాప్రతినిధులు కూడా తోడవడంతో ర్యాలీ సందడిగా సాగుతోంది. స్ధానికంగా విద్యార్ధులు, డ్వాక్రా మహిళలు, ఇతర వర్గాల్ని కూడా భారీగా తరలించారు.












Click it and Unblock the Notifications