విశాఖ లవర్ హత్య .. ఆన్లైన్లో కత్తులు, రక్తపు వాసన రాకుండా సెంట్ కొట్టి.. భయానకం!
విశాఖపట్నం మౌనిక హత్య కేసులో ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు జరుపుతున్న ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు రవీంద్ర, మౌనిక పరిచయం హత్యకు దారి తీసిన పరిస్థితులపై కీలక వివరాలు వెల్లడయ్యాయి. నేవీ ఉద్యోగిగా పనిచేస్తున్న రవీంద్ర 2020 లాక్డౌన్ సమయంలో డేటింగ్ యాప్ ద్వారా మౌనిక తో పరిచయాన్ని ఏర్పరచుకున్నాడు. వారిద్దరి మధ్య ప్రేమ సంబంధం మూడేళ్లపాటు కొనసాగింది.
మౌనికను చంపింది ఇందుకే.. పోలీసులతో నేవీ ఉద్యోగి
2023లో వారిద్దరు విడిపోయారు. ఆ తర్వాత రవీంద్ర మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత రవీంద్ర సంవత్సరం క్రితం ఎల్బీనగర్లోని అపార్ట్మెంట్ కు మకాం మార్చాడు. నాలుగు నెలల క్రితం అతని భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్ళింది. అయితే ఈ సమయంలో మౌనిక డబ్బుల కోసం రవీంద్రను వేధించడం మొదలు పెట్టింది. డబ్బుల కోసం వేధింపులు కొనసాగిస్తున్న కారణంగా మౌనికను హతమార్చినట్టు రవీంద్ర పోలీసులకు వెల్లడించారు.

ఆన్ లైన్లో కత్తి ఆర్డర్.. హత్య తర్వాత రక్తం వాసన రాకుండా సెంట్
మార్చి 29వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు మౌనికను తన ఎల్బీనగర్లోని అపార్ట్మెంట్ కు పిలిచిన రవీంద్ర ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చాడు. ముందే ఆమెను హతమార్చాలని ప్లాన్ చేసుకున్న రవీంద్ర డీమార్ట్ లో కత్తులు దొరకకపోవడంతో ఆన్లైన్లో ఆర్డర్ చేసి కత్తి తెప్పించుకున్నాడు. హత్య తర్వాత ఇంట్లో రక్తం మరకలను శుభ్రం చేసి సెంట్ చల్లాడు.
ఫ్రిజ్ లో కొన్ని శరీర భాగాలు, మంచం క్రింద గోనెసంచిలో కొన్ని
మౌనిక శరీర భాగాలను ముక్కలుగా చేసి కొన్నింటిని ఫ్రిజ్లో పెట్టాడు, మిగిలినవి గోనెసంచిలో మంచం కింద దాచి పెట్టాడు. మౌనిక తల, చెప్పులు, సిమ్ కార్డులు ఒక సూట్ కేసులో తీసుకువెళ్లి దార పాలెం తోటల దగ్గర కాల్చేశాడు. ఆ తర్వాత స్నేహితుడికి హత్య విషయం చెప్పాడు. దీంతో అతను సలహా మేరకు రవీంద్ర గాజువాక పోలీసుల ముందు లొంగిపోయాడు.
రవీంద్ర చెప్పిన దానికి భిన్నంగా మౌనిక తండ్రి వాదన
అయితే రవీంద్ర డబ్బుల కోసమే హత్య చేశాడని చెబుతున్న వాదనకు భిన్నంగా మౌనిక కుటుంబ సభ్యుల వాదన ఉంది. మార్చి 29వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మౌనిక ఒక ఈవెంట్ కు వెళుతున్నాను అని చెప్పి వెళ్లిందని ఆ తర్వాత మౌనిక ఫోన్ స్విచాఫ్ వచ్చిందని, ఈవెంట్ బిజీలో ఉండడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుందని తమ భావించినట్లుగా తండ్రి వేణుగోపాల్ తెలిపారు.
రవీంద్ర ఎవరో కూడా తమకు తెలీదన్న తల్లిదండ్రులు
రాత్రి ఇంటికి రాకపోవడంతో ఎక్కడెక్కడో వెతికాం అన్నారు. శుక్రవారం ఉదయం హత్య విషయం తెలిసిందని ఆయన అసలు రవీంద్ర ఎవరో కూడా తమకు తెలియదన్నారు. మౌనిక కు ఎవరితోనూ ఎటువంటి ప్రేమ వ్యవహారాలు లేవని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications