వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల వేలం- కేంద్ర నిర్ణయం, నెక్స్ట్ ఇక..!!

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మరో కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ప్లాంట్ పరిధిలోని విలువైన స్థలాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్లాంట్‌కు సంబంధించి సుమారు 93,572 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న మొత్తం 459 ప్లాట్లను బహిరంగ ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. దీంతో, ఇలా కేంద్రం వరుసగా తీసుకుంటున్న నిర్ణయాల వేళ తదుపరి చర్యల పైన కార్మికుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలోని విలువైన స్థలాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్లాంట్‌కు సంబంధించి సుమారు 93,572 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న మొత్తం 459 ప్లాట్లను బహిరంగ ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు రంగం సిద్ధమైంది.స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం హెచ్‌బీ కాలనీతో పాటు ఆటోనగర్‌, విశాఖపట్నం బయట హైదరాబాద్‌, చెన్నై వంటి ప్రాంతాల్లో ఉన్న భూములను కూడా విక్రయానికి పెట్టింది. దానిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై స్టే విధించడంతో కొన్నాళ్లు వేలం ఆగిపోయింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ వల్ల నిరుపయోగంగా ఉన్న భూముల ద్వారా ఆదాయం వచ్చేలా చేయడానికి 'నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌' (ఎన్‌ఎల్‌ఎంసీ)ని 2022లో ఏర్పాటు చేసింది. ఇప్పుడు స్టీల్‌ ప్లాంటు భూముల ఈ-వేలం బాధ్యతలు ఆ సంస్థకు అప్పగించారు.

ఏపీ కేబినెట్ భేటీ: ఉద్యోగుల బకాయిలు, స్థానిక ఎన్నికల పై కీలక నిర్ణయాలు..!!
ఏపీ కేబినెట్ భేటీ: ఉద్యోగుల బకాయిలు, స్థానిక ఎన్నికల పై కీలక నిర్ణయాలు..!!
visakha-steel-plant-to-e-auction-459-plots-in-the-city-through-nlmc-into-the-monetisation-process

కేంద్రం తాజా నిర్ణయంతో

అందులో భాగంగా హెచ్‌బీ కాలనీలతో 456 ప్లాట్లు (సుమారుగా 18.17 ఎకరాలు), ఆటోనగర్‌లో బ్లాక్‌ 2, 3లలో మూడు ప్లాట్లు (0.56 ఎకరాలు చొప్పున) మొత్తం 19.29 ఎకరాలు వేలం వేసి రూ.900 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎన్‌ఎల్‌ఎంసీ 'ఎక్స్‌'లో ప్రకటించింది. అయితే ప్లాట్ల విస్తీర్ణాలు, వాటి నామమాత్రపు ధరలు ఏవీ అందుబాటులో ఉంచలేదు. విశాఖలో ప్రస్తుతం భూముల ధరలు అధికంగా ఉన్నాయి. హెచ్‌బీ కాలనీ ప్రధాన రహదారిని ఆనుకొనే ఉంది. జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16కి)కి దగ్గరగాను ఉంది. భూగర్భ నీటి సమస్య లేదు. చదరపు గజం రూ.2 లక్షలు చొప్పున అమ్ముడయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసుకుంటే 18 ఎకరాలకు సుమారు రూ.1,700 కోట్ల వరకు ఆదాయం వస్తుందని స్టీల్‌ ప్లాంటు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విక్రయ ప్రక్రియను అక్టోబర్ 12, అక్టోబర్ 16 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+