విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తరలింపు షురూ: అక్కడ సర్దుబాటు- శరవేగంగా మూసివేత
Visakhapatnam Steel Plant: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. మరో అడుగు ముందుకు వేసింది. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి ఇనుము, బొగ్గు సరఫరా స్తంభించిపోవడంతో అనేక అనుమానాలకు తెర తీసినట్టయింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేస్తూ వచ్చింది.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకున్నారు. ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.
మిత్రపక్షాల సహకారంతో ఏపీలో తామే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విక్రయ ప్రయత్నాల్లో వేగం పెంచింది కేంద్ర ప్రభుత్వం. శరవేగంగా ప్రైవేటుపరం చేయడానికి పావులు కదుపుతోంది. వీలైనంత వేగంగా దీన్ని విక్రయించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. దూకుడు పెంచింది.
ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి.. ఇటీవలే విశాఖపట్నానికి వచ్చారు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికేననే అభిప్రాయాలు కార్మికుల్లో బలంగా నాటుకుపోయాయి.
ఈ పరిణామాల మధ్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ భట్.. దీర్ఘకాల సెలవులకు వెళ్లాని నిర్ణయించారు. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అప్పటివరకూ సెలవు తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) అరుణ్ కుమార్ బాగ్చి తాత్కాలిక సీఎండీ నియమితులయ్యారు.

అదే సమయంలో ఉద్యోగుల తరలింపు సైతం ముమ్మరం అయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో శాశ్వత ప్రాతిపదికన పని చేస్తోన్న వారిలో వంద మందిని డెప్యుటేషన్ మీద పంపించనుంది కేంద్రం. వారందరినీ కూడా నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో సర్దుబాటు చేయనున్నారు.
డెప్యుటేషన్‌పై వారిని ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ఎండీసీకి చెందిన నాగర్‌నార్ స్టీల్ ప్లాంట్‌కు బదిలీ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారని ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. ఎన్ఎండీసీ సీఎండీ అమితావా ముఖర్జీ నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు.
ఇప్పటికే రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు మూత పడ్డాయి. బ్లాస్ట్ ఫర్నేస్- 1 గోదావరి ఇదివరకే స్తంభించిపోయింది. బ్లాస్ట్ ఫర్నేస్- 3 అన్నపూర్ణ కార్యకలాపాలను మొన్నీ మధ్యే నిలిపివేశారు. ప్రస్తుతం ఒక్క బ్లాస్ ఫర్నేస్- 3 కృష్ణ మాత్రమే అందుబాటులో ఉంది. బొగ్గు నిల్వలు అయిపోయాక దీన్ని కూడా మూసివేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో అక్కడ ఉద్యోగులకు పని ఏదీ లేకపోవడం వల్ల వారందరినీ కూడా ఇతర సంస్థల్లో సర్దుబాటు చేయనున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అందరినీ కూడా దశలవారీగా తొలగించే అవకాశం ఉందని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications