మహేశ్ బాబుతో బుచ్చిబాబు సినిమా..? ఈ సారి ఆ పార్ట్ కటింగ్..?
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ బుచ్చిబాబు సానా.. ప్రస్తుతం పెద్ది మూవీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 'ఉప్పెన' తో తొలి సినిమాకే జాతీయ అవార్డు అందుకోవడమే కాకుండా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది ఈ మూవీ. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేశారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ రిలీజైన కేవలం 5 రోజుల్లోనే రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది పెద్ది మూవీ. ఇక ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియాల్సి ఉంది. ఇలా వరుసగా రెండు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి జోరు మీద ఉన్నారు దర్శకుడు బుచ్చిబాబు సానా.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శకుడు బుచ్చిబాబుపై ఓ విచిత్రమైన విమర్శ తెగ వైరల్ అవుతోంది. అదేంటి అంటే.. బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెన లో హీరోకి అంగచ్చేదనం చేస్తారు. ఇటీవల వచ్చిన పెద్దిలో రామ్ చరణ్ కు ఓ కాలు పోతుంది. దాంతో ఆయన పారా అథ్లెట్ గా మారుతారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. బుచ్చిబాబు సినిమా అంటే హీరోకు ఏదో ఒక అవయవం కట్ అవ్వాల్సిందేనా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక బుచ్చిబాబు తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయనున్నట్లు సమాచారం. ఇదే విషయంపై బుచ్చిబాబును కొందరు అడగ్గా.. అదేనండీ చర్చలు జరుగుతున్నాయి. ఇంకా టైమ్ పడుతుంది అని చెప్పుకొచ్చారు. మరి మహేష్ బాబు సినిమాలో ఏదైనా అవయవం కట్ చేస్తారా..? అని అడిగితే అయ్యో అదేం లేదండీ.. కథలో వస్తే వస్తుంది అని నవ్వేశారు.. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మూవీలో మహేశ్ బాబును అంధుడిగా చూపిస్తారంటూ టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళితో వారణాసి చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వారణాసి మూవీ తర్వాత మహేశ్ బాబు చేయబోయే సినిమాపై క్లారిటీ లేదు. లైన్ లో సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి దర్శకులు ఉన్నారు. ఇప్పుడు బుచ్చిబాబు పేరు కూడా వినిపిస్తోంది. మరి వారణాసి తర్వాత మహేశ్ బాబు ఎవరిని ఓకే చేస్తారో..? చూడాలి.












Click it and Unblock the Notifications