మళ్లీ కలిసిపోయిన "రవి మోహన్- కెనీషా".. వీడియో వైరల్ !!
తమిళ సినీ పరిశ్రమలో తనదైన నటన, వైవిధ్యమైన కథల ఎంపికతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో జయం రవి. మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నారు. 'తని ఒరువన్', 'బోగన్', 'అదంగ మారు', 'పొన్నియన్ సెల్వన్', 'పోన్మగళ్ వందాల్' వంటి చిత్రాలతో కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిన రవి మోహన్.. తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా 'తని ఒరువన్' చిత్రాన్ని రామ్ చరణ్ 'ధృవ'గా రీమేక్ చేయడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన పేరు బాగా పరిచయమైంది. ప్రస్తుతం సినిమాల కంటే వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే గత ఏడాది తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు రవి మోహన్ అధికారికంగా ప్రకటించడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. దాదాపు ఎన్నో ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ తీసుకున్న ఈ నిర్ణయం కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండటం, బయటకు ఆదర్శ కుటుంబంలా కనిపించడం వల్ల ఈ వార్త మరింత సంచలనంగా మారింది. విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో రవిపై విమర్శలు కూడా వచ్చాయి.

ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సింగర్ కెనీషాతో రవి మోహన్ రిలేషన్‌లో ఉన్నారంటూ కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి పలు ఈవెంట్లలో కనిపించడం, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. దర్శకుడు గణేష్ కుమార్తె వివాహ వేడుకకు రవి మోహన్, కెనీషా కలిసి హాజరుకావడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కెనీషా సుదీర్ఘ పోస్టు పెట్టి మరీ ఇన్ డైరెక్ట్ గానే బ్రేకప్ చెప్పేసింది.
దాంతో ప్రెస్ మీట్ పెట్టిన రవి విడాకులు మంజురయ్యే వరకు సినిమాల్లో నటించని ప్రకటన కూడా చేశాడు. ఆర్తితో పెళ్లి తర్వాత నరకం చూశానని.. మొదటి రోజు నుంచే బ్లాక్ మెయిల్ చేశారని ఎమోషనల్ అయ్యారు. ఆఖరికి తాను సంపాదించుకున్న డబ్బుని దాచుకోవడానికి కూడా ఒక అకౌంట్ లేకుండా చేశారని భోరుమని ఏడ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా కెనీషా మళ్లీ జయం రవితో కలిసి తిరుమలలో కనిపించారు. వీరిద్దరూ కలిసి శ్రీవారి దర్శనానికి వెళుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరు మళ్లీ కలిసిపోయారని నెట్టింట టాక్ వినిపిస్తోంది.
Ravi Mohan and Kenisha reunite after separation! pic.twitter.com/xjT0mYi6ip
— Princy (@Mrking1618) June 9, 2026
అయితే ఈ వీడియో కొత్తదా? పాతదా? అన్నది క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే గతంలో పలు మార్లు తిరుమలకు జంటగ వచ్చారు రవి- కెనీషా. మరోవైపు ఆర్తితో విడాకులు వచ్చేంత వరకు సినిమాల్లో నటించనని ప్రకటించిన రవి ఇటీవలే ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మరోవైపు జయం రవి , ఆయన భార్య ఆర్తి రవిల మధ్య జరుగుతున్న విడాకుల వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్తి దాఖలు చేసిన తాత్కాలిక భరణం కేసులో కుటుంబ సంక్షేమ కోర్టుకు మరికొంత సమయం ఇవ్వాలంటూ జయం రవి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం (జూన్ 09) కొట్టివేసింది.












Click it and Unblock the Notifications