Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేత ముమ్మరం: సెలవుల్లో సీఎండీ- రిటైర్ అయ్యేంత వరకూ?

Visakhapatnam Steel Plant: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. మరో అడుగు ముందుకు వేసింది. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడిఇనుము, బొగ్గు సరఫరా స్తంభించిపోవడంతో అనేక అనుమానాలకు తెర తీసినట్టయింది.

లెక్క చేయని కేంద్రం..

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేస్తూ వచ్చింది.

Visakhapatnam steel plant privatization CMD of RINL Atul Bhatt on leave till retirement

ప్రైవేటీకరణ ప్రయత్నాలు ముమ్మరం..

ఆర్థిక వ్యవహారాల మీద ఏర్పాటైన కేబినెట్ కమిటీ.. గతంలోనే దీన్ని విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వందశాతం మేర పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన ఆమోదాన్ని తెలియజేసింది. దీనికి సంబంధించిన నివేదికలను అప్పట్లోనే కేంద్ర ఆర్థిక శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలకు అందజేసిన కేబినెట్ సబ్ కమిటీ.

2003లో బిడ్స్ ఆహ్వానం..

కేబినెట్ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం- మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీలో సబ్సిడయిరీస్ లేదా జాయింట్ వెంచర్స్ ఉంటే వాటిని కూడా వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. 2003లో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ బిడ్స్‌ను సైతం ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం.

టీడీపీ కూటమిపై

ప్రైవేటీకరణ చర్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకుంది. ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.

కుమారస్వామి సమీక్షతో వేడి..

ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. దూకుడు పెంచింది. ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి.. ఇటీవలే విశాఖపట్నానికి వచ్చారు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికేననే అభిప్రాయాలు కార్మికుల్లో బలంగా నాటుకుపోయాయి.

ఆందోళనతో..

ఈ నేపథ్యంలో మరోసారి రోడ్డెక్కారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి నాయకులు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించారు. రాస్తారోకో చేపట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ చర్యలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు- పవన్ కల్యాణ్ సారథ్యంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలంటూ నినదించారు.

సెలవుల్లో సీఎండీ..

ఈ పరిణామాల మధ్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ భట్.. దీర్ఘకాల సెలవులకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అప్పటివరకూ సెలవు తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) అరుణ్ కుమార్ బాగ్చి తాత్కాలిక సీఎండీ నియమితులయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+