విశాఖపట్నంకు ముఖ్య సూచన చేసిన కేంద్రం
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రతిరోజు నడుస్తున్న గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి రైల్వే శాఖ అధికారులు శుభవార్తను చెప్పారు. ఇప్పటివరకు ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)నడుస్తున్న ఈ రైలుకు ఇకనుంచి లింక్డ్ హాఫ్ మన్ బుష్ (LHB)బోగీలను ఏర్పాటు చేశారు. ఈ బోగీలతో ప్రయాణించడంద్వారా ప్రయాణికులకు జర్నీలో ఎటువంటి కుదుపులు ఎదురుకావు. పాతబోగీలతో ప్రయాణిస్తున్న ప్రతిసారీ సమస్యలు ఎదురవుతుండటంతో వీటిని మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ప్రయాణంలో కుదుపులు ఉండవు
సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలుకు ఈనెల 22 నుంచి, విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలుకు 23వ తేదీ నుంచి కొత్త బోగీలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం 18 థర్డ్ ఏసీ బోగీలుంటాయి. ఒక్కో బోగీలో 83 బెర్త్ లు ఉంటాయి. ప్రస్తుతం ఐసీఎఫ్ బోగీల్లో 72 బెర్త్ లే ఉన్నాయి. ప్రయాణికుల నుంచి డిమాండ్లు ఎక్కువగా వస్తుండటంతో మిడిల్ బెర్త్ లను ఏర్పాటు చేశారు. ఒక్కో బోగీకి 11 అదనపు బోగీల చొప్పున 18 బోగీలద్వారా 181 అదనపు బెర్త్ లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రతిరోజు రాత్రి 8.40 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

అన్నీ ఎరుపు రంగులోనే
ఐసీఎఫ్ బోగీలన్నీ ఆకుపచ్చ రంగులో ఉండేవి. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న బోగీలు ఎరుపు రంగులో ఉంటాయి. దేశవ్యాప్తంగా అన్నీ ఏసీ బోగీలతో గీరభ్ రథ్ పేరుతో వివిధ నగరాల మధ్య తిరుగుతున్నప్పటికీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య తిరుగుతున్న గరీబ్ రథ్ కు మాత్రం విపరీతమైన ఆదరణ పొందుతోంది. మిగతా రైళ్లకు మాత్రం ఇంత ఆదరణ లేదు. ఈ మార్గంలో నిత్యం రైళ్లకు డిమాండ్ ఎక్కువ ఉండటంతో వందే భారత్ రైళ్లను కూడా రెండు రైళ్లు తిప్పుతున్నారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి బయలుదేరుతున్నాయి.












Click it and Unblock the Notifications