వైజాగ్ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఇలా-48 గంటల పాటు చెర-వివరించిన ఎంవీవీ..
ఏపీలో విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల్ని కొందరు అగంతకులు కిడ్నాప్ చేశారన్న వార్త ఇవాళ ఉదయం నుంచీ కలకలం రేపింది. ఆ తర్వాత పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సినీఫక్కీలో నిందితుల్ని ఛేజ్ చేశారనే వార్త కూడా తెలిసింది. చివరికి విశాఖ ఎంపీ భార్య, కుమారుడిని, ఆడిటర్ ను కూడా రక్షించినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన జరిగిన సమయంలో హైదరాబాద్ లో ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆ తర్వాత విశాఖ తిరిగొచ్చారు. అసలుఏం జరిగిందో వెల్లడించారు.
తన భార్య, కుమారుడు, ఆడిటర్ రెండు రోజుల క్రితమే కిడ్నాప్ కు గురయ్యారన్న వార్త తెలుసుకున్న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైదరాబాదు నుంచే పోలీసులతో మాట్లాడుతూ పరిస్ధితి సమీక్షించారు. అలాగే తనకు అనుమానం ఉన్న వారి వివరాలు కూడా అందించారు. అనంతరం పోలీసులు వారిని రక్షించిన తర్వాత హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచతి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఎంవీవీ సత్యనారాయణ...అనంతరం మీడియాతో మాట్లాడారు.

తన కొడుక్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. అప్పుడు తన కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ అయ్యారని తెలిసిందన్నారు. 48 గంటల పాటు కిడ్నాపర్లు వారిని తమ ఇంట్లోనే బంధించినట్లు తెలిసిందన్నారు. తన కొడుకుని కిడ్నాప్ చేసింది హేమంత్ అనే రౌడీ షీటర్ అని తెలిసిందని ఎంవీవీ తెలిపారు. గతంలో కూడా రౌడీషీటర్ హేమంత్ కిడ్నాప్ కేసులో ముద్దాయిగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
వైజాగ్ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఇలా-48 గంటల పాటు చెర-వివరించిన ఎంవీవీ..!#AndhraPradesh #Vizag #Police #Kidnapping #MVVSatyanarayana #Oneindiatelugu pic.twitter.com/eaSRJb4Vqk
— oneindiatelugu (@oneindiatelugu) June 15, 2023
అసలు ఈ కిడ్నాప్ కేవలం డబ్బు కోసమే జరిగిందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు. డబ్బు కోసమే తన కొడుకుని, భార్యని కిడ్నాప్ చేశారన్నారు. రెండు గంటల్లోనే విశాఖ పోలీసులు దీన్ని ఛేదించారన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ కమిషనర్, డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications