జగన్‌తో రహస్య ఒప్పందాలా, హోదా అంటే తెలుసా: విష్ణుకుమార్ రాజు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో తమకేమీ రహస్య ఒప్పందాలు లేవని బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా ఆయన మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడారు.

  బాబుకు వీర్రాజు ఊహించని షాక్! 2014లో చంద్రబాబు గెలిచేవారా ?

  ప్రత్యేక హోదా అంటే తెలియనివాళ్లు చాలా మంది ఉన్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. హోదా వల్ల రాయితీలు వస్తాయనే తప్పుడు భావనతో కూడా ఉన్నారని అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి 42 శాతం నిధులు వస్తాయని ఆయన చెప్పారు.

  లోటుపై అదే మాట

  లోటుపై అదే మాట

  రెవెన్యూ లోటుపై విష్ణుకుమార్ రాజు పాత మాటే చెప్పారు. రెవెన్యూ లోటును కేంద్రం రూ.4,117 కోట్లుగా తేల్చిందని చెప్పారు. జాతీయ సంస్థలకు ఇచ్చిన భూముల వివుల లెక్కకట్టడం, రాష్ట్రానికి కేంద్రం ఏం చేయగలేదని అనడం సరి కాదని ఆయన అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

   హోదాపై నేనేనీ చెప్పలేను

  హోదాపై నేనేనీ చెప్పలేను

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై తానేమీ చెప్పలేని విష్ణు కుమార్ రాజు అంతకు ముందు మీడియా ప్రతినిధులతో అననారు. విశాఖకు రైల్వే జోన్‌ను తెచ్చే బాధ్యత తమదేనని చెప్పారు. రాజకీయ నిర్ణయం తీసుకుంటామని, రైల్వే జోన్ వచ్చి తీరుతుందని అన్నారు.

   వారి మాటలు పట్టంచుకోవద్దు.

  వారి మాటలు పట్టంచుకోవద్దు.

  అధికారులు ఎప్పుడూ వ్యతిరేకంగానే చెబుతారని విష్ణు కుమార్ రాజు అన్నారు. గంతలోనూ అధికారులు వ్యతిరేకంగానే చెప్పారని ఆయనయ అన్నారు. అధికారుల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేనది అన్నారు

  బాబు మాటలు సరి కాదు...

  బాబు మాటలు సరి కాదు...

  కేంద్రంపై చంద్రబాబు వ్యాఖ్యలను బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. తప్పంతా కేంద్రానిదే అన్నట్లు మాట్లాడడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎన్డిఎలో ఉన్నామంటూనే కేంద్రాన్ని నేరుగా విమర్శించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఆయన విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబును ప్రశ్నించారు.

   అవి వాస్తవాలు కావా...

  అవి వాస్తవాలు కావా...

  కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే ఎపికి పెట్టుబడులు వచ్చాయా అని మాధవ్ ప్రశ్నించారు. సీసీ రోడ్లు, రహదారుల నిర్మాణం వాస్తవం కాదా అని అడిగారు. రాజకీయావసరాల కోసం ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. రాజకీయ కారణాలతోనే రైల్వే జోన్ అంశాన్ని లేవనెత్తుతున్నారని విమర్శించారు. దీనివల్ల ప్రజలకు ఏ విధమైన ప్రయోజనమూ లేదని అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  BJP MLA Vishnukumar Raju clarified that there was no secret pact with YSR Congress president YS Jagan.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి