Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీలోకి బీజేపీ ముఖ్య నేత - కండీషన్స్ అప్లై..!?

ఏపీ బీజేపీలో మరో ముఖ్య నేత వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విష్ణుకుమార్ రాజుకు పార్టీ మెమో జారీ చేసింది. దీని పైన ఆయన వివరణ ఇచ్చారు. కానీ, విష్ణుకుమార్ రాజు బీజేపీలో కొనసాగటం పైన ఆ పార్టీ నేతలే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలనేది విష్ణుకుమార్ రాజు అంతరంగం. అందుకు పార్టీలో పరిస్థితులు అనుకూలించకపోవటంతో పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

టీడీపీలోకి బీజేపీ నేత: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల్లో చేరికలు పెరుగుతున్నాయి. బీజేపీలో ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కన్నా లక్ష్మీనారాయణ పార్టీ వీడి టీడీపీలో చేరారు. ఇప్పుడు మరో నేత విష్ణుకుమార్ రాజు అదే బాట ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటి నుంచే టీడీపీ, జనసేన పొత్తు ఖాయం కావటంతో బీజేపీ కూడా ఆ రెండు పార్టీలతో కలవాలని ప్రతిపాదిస్తున్నారు. దీని ద్వారా పరోక్షంగా ఆ రెండు పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. బీజేపీతో కలిస్తే కమలం పార్టీలోనే కొనసాగేలా, లేకపోతే టీడీపీలో చేరాలనేది విష్ణుకుమార్ రాజు ఆలోచనగా తెలుస్తోంది.

Vishnu Kumar Raju

సీటు పైన డైలమా: 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతుతో టీడీపీ- బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా గెలిచిన విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా పని చేసారు. ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు నిర్ణయాన్ని తప్పు బట్టారు. 2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఇదే నియోజకవర్గంలో 18,790 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి గంటా విజయం సాధించారు. ఇప్పుడు గంటా తిరిగి అక్కడ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీటు దాదాపు ఖాయం చేసుకున్నారు. అటు పవన్ తోనూ గంటా దగ్గరగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో గంటా తిరిగి టీడీపీలో చేరినా విశాఖ నార్త్ సీటు దక్కటం పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Vishnu Kumar Raju

ముందస్తు వ్యూహాలతో: ఇప్పటికే విష్ణుకుమార్ రాజు టీడీపీతో రాయబారం నడిపారనే చర్చ జోరుగా సాగుతోంది. సీటు గురించి ప్రస్తుతం తర్జన భర్జన సాగుతున్నట్లు సమాచారం. తాజాగా పార్టీ నాయకత్వం బీజేపీకి సీట్లు గెలవటం పైన విష్ణు కుమార్ రాజు కామెంట్స్ చేసారంటూ మెమో ఇచ్చింది. ఇప్పుడు విష్ణు కుమార్ రాజు దీని పైన వివరణ ఇచ్చాన..2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ- జనసేన నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే సూత్ర ప్రాయంగా ఆమోదం లభించిందని బీజేపీ నేతల్లో వినిపిస్తున్న చర్చ. కానీ, సీటు విషయంలో క్లారిటీ లేకుండా పార్టీ మారటం ద్వారా రాజకీయంగా నష్టపోతాననే అభిప్రాయంతో విష్ణు కుమార్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది. దీని పైన స్పష్టత రాగానే..అధికారికంగా విష్ణుకుమార్ రాజు పార్టీ మారుతానే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+