ఆ మంత్రిని కాస్త పడుకోమని చెప్పండి: ఏపీ అసెంబ్లీలో నవ్వులు, జగన్‌పై ఎస్వీ మోహన్ రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ మంత్రి నారాయణ రాత్రి పగలు లేకుండా పని చేస్తున్నారని, ఇటీవల విశాఖలో తెల్లవారుజామునే ఆకస్మిక తనిఖీలు చేశారని, నారాయణ కూడా కాస్త విశ్రాంతి తీసుకోవాలని, ఆయన పడుకోవాలని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు.

YS Jagan Padayatra : బాబు అవసరమా? పాదయాత్రలో ఎవరిని పలకరించినా | Oneindia Telugu

చదవండి: అనూహ్యం, అసెంబ్లీలో మంత్రులకు షాకిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో మంగళవారం గృహనిర్మాణ పథకం అమలుపై చర్చ సందర్భంగా కొన్ని సరదా దృశ్యాలు కనిపించాయి. పీఎంఏవై కింద రాష్టానికి అత్యధిక ఇళ్లు వచ్చాయని, దీని వెనుక ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాత్ర ఉందని విష్ణు చెప్పారు.

రోజుకు 18 గంటల కష్టం

రోజుకు 18 గంటల కష్టం

ఈ సందర్భంగా ఆయన సభలో నవ్వులు కూడా పూయించారు. సీఎం చంద్రబాబుతో సమానంగా నారాయణ కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్టపడుతుంటారని విన్నామని, నారాయణ కూడా అదే విధంగా పని చేస్తున్నారన్నారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.

నారాయణ నిర్విరామంగా

నారాయణ నిర్విరామంగా

నారాయణ ఉదయం అయిదింటి నుంచి నిర్విరామంగా పని చేస్తూనే ఉంటారని, కొంతసేపు పడుకుని విశ్రాంతి తీసుకోమని మీరు చెబితే బాగుంటుందని స్పీకర్ కోడెల శివప్రసాద రావును ఉద్దేశించి అన్నారు.

నా భావం అర్థమైందనుకుంటా

నా భావం అర్థమైందనుకుంటా

గృహనిర్మాణాలకు స్థలం కొరతతో ఒక నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారులను మరో నియోజకవర్గంలో సర్దుబాటు చేయడాన్ని కూడా విష్ణు ప్రస్తావించినప్పుడు సభలో నవ్వులు విరిశాయి. విశాఖలో తన నియోజకవర్గంలో ఇళ్లు నిర్మించడానికి స్థలం లేక ఇంకో నియోజకవర్గంలో కడుతున్నారని, అక్కడికి వారంతా వెళితే తర్వాత వారంతా ఏమవుతారో మీకు చెప్పాల్సింది కాదని, తన భావం మీకు అర్థమై ఉంటుందని, ఇది అందరికీ వర్తిస్తుందని, ఏ నియోజకవర్గంలో ఉన్నవారికి ఆ నియోజకవర్గంలోనే ఇళ్లు కట్టించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీంతో సభ్యులు ఒక్కసారిగా బల్లలు చరిచారు.

జగన్‌పై ఎస్వీ మోహన్ రెడ్డి

జగన్‌పై ఎస్వీ మోహన్ రెడ్డి

కర్నూలు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గృహనిర్మాణ పథకం చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని, అనుభవం ఉన్న నేతకు పట్టుదల, దక్షత ఉంటే ఎలాంటి కార్యక్రమం చేపట్టవచ్చో అధికారపక్షం వైపు చూస్తే తెలుస్తోందని, అదే అనుభవరాహిత్యం ఉన్న నేత ఉంటే ఎలా ఖాళీగా ఉంటుందో ప్రతిపక్ష స్థానాల వైపు చూస్తే అర్థమవుతుందని అన్నారు. ఈ మాటలకు కూడా అందరూ నవ్వారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh BJPLP Vishnu Kumar Raju on Tuesday praised Minister P Narayana for his work.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి