అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు ఝలక్! అనూహ్యం, అసెంబ్లీలో మంత్రులకు షాకిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండు రోజులుగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంటోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండు రోజులుగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంటోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

జగన్ పాదయాత్ర, ఎన్టీఆర్‌పై వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు: వరుసగా అలకలుజగన్ పాదయాత్ర, ఎన్టీఆర్‌పై వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు: వరుసగా అలకలు

టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా మంత్రులను నిలదీయడం, దానికి మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపడం విస్తు గొలుపుతోంది. ఇది అందరికీ అనూహ్య పరిణామంగానే కనిపిస్తోంది.

 మంత్రులను నిలదీసిన గోరంట్ల, విష్ణు మద్దతు

మంత్రులను నిలదీసిన గోరంట్ల, విష్ణు మద్దతు

మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడును నిలదీశారు. తమ ప్రశ్నలకు మంత్రులు సరైన సమాధానం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆయన వాదనకు బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మద్దతు పలికారు.

 సోమవారం కూడా

సోమవారం కూడా

సోమవారం అసెంబ్లీలో దూళిపాళ్ల నరేంద్ర కూడా పర్యాటక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ బోటు ప్రమాదంపై మాట్లాడుతూ.. ఇందులో అధికారుల తప్పిదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గోరంట్ల కూడా మంత్రిని నిలదీయడం గమనార్హం.

 జీరో అవర్ తీసేయండి

జీరో అవర్ తీసేయండి

మంగళవారం అసెంబ్లీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రులను నిలదీశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని, అలా అయితే ఇక జీరో అవర్ ఎందుకని, దానిని తీసేయాలని సభలో గోరంట్ల ఊగిపోయారు.

 ప్రతిపక్ష పాత్రలో అధికార పక్షం

ప్రతిపక్ష పాత్రలో అధికార పక్షం

సాధారణంగా సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మంత్రులను నిలదీస్తారు. మంత్రుల సమాధానానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలుకుతారు. కానీ వైసీపీ గైర్హాజరు కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషించడం గమనార్హం. వైసీపీ లాంటి ప్రతిపక్షం అవసరం లేదన్న రీతిలో టీడీపీ వ్యవహరించడం గమనార్హం. వైసీపీ అవసరం కూడా లేదనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది బాబు అభిప్రాయం.

 ఎమ్మెల్యేలకు చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ

ఎమ్మెల్యేలకు చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ

ఇదిలా ఉండగా, సభలో ప్రతిపక్షం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఎమ్మెల్యేలు ప్రతిపక్షంగా వ్యవహరించాలని, సమస్యలపై మంత్రులను నిలదీయాలని పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. చంద్రబాబు స్వేచ్ఛ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. ఆ వెసులుబాటు కల్పించారు.

జగన్ కంటే బెట్టర్ అనిపించేలా

జగన్ కంటే బెట్టర్ అనిపించేలా

ప్రతిపక్ష వైసీపీ సమావేశాలకు హాజరైనప్పటి కంటే ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తేనే ప్రజలకు బెట్టర్ అనిపించేలా సభ నడవాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులను నిలదీస్తుండటంతో సభలో సీరియస్‌నెస్ కూడా కనిపిస్తోంది.

 ఆ అసంతృప్తి ఉందా?

ఆ అసంతృప్తి ఉందా?

గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి నేతలు మంత్రి పదవిని ఆశించారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. దీంతో ఆ అసంతృప్తితో మంత్రులను నిలదీస్తున్నారా, ఆ ఆగ్రహం ఇలా తీర్చుకుంటున్నారా అనే చర్చ సాగుతోంది. అయితే చంద్రబాబు సమస్యలపై పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే వారు నిలదీస్తున్నారని చెబుతున్నారు.

English summary
Telugu Desam Party MLAs opposition role in Andhra Pradesh Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X