పేటీఎం బ్యాచ్‌తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్
ఏపీ రాజకీయాల్లో మరోసారి 'శివాజీ' బాంబు పేలింది. గతంలో 'ఆపరేషన్ గరుడ'తో సంచలనం సృష్టించిన నటుడు శివాజీ, ఇప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తాజా చిత్రం 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాను అడ్డుకోవడానికి జగన్ సేన కుట్రలు చేస్తోందని, విడుదల కాకముందే నెగిటివ్ రివ్యూలతో విషం చిమ్ముతున్నారని శివాజీ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా మారుతోంది.
"జగన్ గారు.. నా జోలికి రావొద్దు. అధికారంలో ఉన్నప్పుడే నన్ను ఏమీ చేయలేకపోయారు, ఇప్పుడు మీ వల్ల ఏమవుతుంది?" అంటూ శివాజీ నేరుగా జగన్‌కే సవాల్ విసిరారు. జగన్ పెంచి పోషిస్తున్న 'పేటీఎం బ్యాచ్' తన సినిమాపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని, 100 మంది సబ్‌స్క్రైబర్లు లేని వారు కూడా తన సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "నా సినిమాను ఆపగలరేమో కానీ, శివాజీని ఎవరూ ఆపలేరు" అని ఆయన స్పష్టం చేశారు.

సీబీఐ కేసుల నేతలకు చెక్ పెట్టాలి..
ఈ వివాదం కేవలం సినిమాకే పరిమితం కాకుండా రాజకీయ మలుపు తిరిగింది. సీబీఐ కేసులున్న వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని, వారిని రాజకీయాల నుంచి తప్పించాలని తాను ప్రధాని నరేంద్ర మోదీని కోరతానని శివాజీ పేర్కొన్నారు. రాజకీయ నేతలపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేస్తేనే సీబీఐ వంటి వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని వ్యాఖ్యానించారు. జగన్ ఎదుర్కొంటున్న కేసులను ఉద్దేశించే శివాజీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.
అమరావతి కోసం పోరాటం ఆగదు!
తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, అమరావతి రాజధాని రైతుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని శివాజీ తేల్చి చెప్పారు. "నేను ఎవరికీ భయపడను, నిజాయితీగా బతుకుతున్నాను. ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని బతికే వాడిని కాదు" అంటూ తనను విమర్శించే వారికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తన సినిమాపై ఎన్ని నెగిటివ్ రివ్యూలు రాయించినా, వారం తర్వాతైనా ప్రజలు తన చిత్రాన్ని ఆదరిస్తారనే ధీమా వ్యక్తం చేశారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications