వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రుద్రాక్ష ధరించి ఈ మాటలేంది సామీ: మంత్రి కొడాలి నానిపై విష్ణువర్ధన్ రెడ్డి గుస్సా..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో అంతర్వేది రథం దగ్ధం ఘటన అగ్గిరాజేసింది. దీనిపై హిందూ సంఘాలు, ప్రతిపక్షాల ఆందోళనతో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే రథం దగ్గం కావడంతో కొత్తది నిర్మిస్తున్నామని మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్లు చిచ్చురేపాయి. దీనిపై ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి. నాని లక్ష్యంగా విమర్శానాస్త్రలు సంధిస్తున్నారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మంత్రి నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాధ్యతాయుతమైన పదవీలో ఉండి ఇలాంటి విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.

కుట్ర కోణం..?

కుట్ర కోణం..?

రాష్ట్రంలో హిందువుల విశ్వసాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. జరుగుతోన్న పరిణామాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడుల వెనక కుట్ర ఉంది అని ఆరోపించారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం తేలికగా తీసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించి.. చేతులు దులుపుకోవడమేనా అని ప్రశ్నించారు.

రుద్రాక్ష ధరించి..

రుద్రాక్ష ధరించి..


మంత్రి కొడాలి నానిపై వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. కొడాలి నాని రుద్రాక్షలు ధరించి స్వామిజీలా కనిపిస్తారని పేర్కొన్నారు. కానీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటీ అని ప్రశ్నించారు. ఆయన ఆహార్యం మెడిపండు చందంగా ఉంది అని విమర్శించారు. అయితే ఆలయాలకు సంబంధించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం కావన్నారు. ప్రభుత్వ వ్యాఖ్యలుగానే తాము పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.

భర్తరఫ్ చేయాలి...

భర్తరఫ్ చేయాలి...

ఇంత పెద్ద అంశంపై మంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడితే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. నానిని సీఎం జగన్ పిలిచిన పాపాన పోలేదని చెప్పారు. అతనిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కొడాలి నానిపై హిందూ సమాజం కన్నెర్ర చేస్తే గుడివాడలో కొడాలి రాజకీయం జీవితం ముగిసిపోతుందని చెప్పారు. మరోవైపు చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ఆయన కూడా ఆలయాలపై మాట్లాడటం కాస్త విడ్డూరంగా ఉందని.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉందన్నారు.

దళారీ వ్యవస్థకు చరమగీతం.. కానీ

దళారీ వ్యవస్థకు చరమగీతం.. కానీ


వివాదాస్పద వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చడంపై కూడా విష్ణు స్పందించారు. దేశంలో దళారీ వ్యవస్థను రద్దు చేయడం గొప్ప సంస్కరణ అని చెప్పారు. గత పాలకులు చేయని పనిని.. తమ పార్టీ చేసిందని తెలిపారు. కానీ విపక్షాలు మాత్రం దళారుల పక్షాన నిలిచి ఆందోళన చేపడుతున్నారని పేర్కొన్నారు.

English summary
vishnu vardhan reddy slams kodali nani: bjp leader vishnu vardhan reddy slams minister kodali nani on antarvedi comments issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X