డిగ్గీతో భేటీ: తెరాసకు షాక్, కాంగ్రెసులోకి వివేక్?

దిగ్విజయ్ నివాసానికి వెళ్లిన వివేక్ ఆయనతో ఏకాంతంగా సమావేశమై చర్చలు జరిపారు. కాంగ్రెస్ తెరాసతో రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అంశంపైనే దిగ్విజయ్‌ను వివేక్ కలిశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెరాసతో పొత్తు ఇక పాత మాటేనని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని వివేక్‌కు దిగ్విజయ్ స్పష్టం చేసినట్లు తెలిసింది.
తెలంగాణ ఇవ్వలేదనే కారణంతో పార్టీని వీడారు, తెలంగాణ ఇ్చచాం కాబట్టి పార్టీలోకి రావాలని దిగ్విజయ్ వివేక్‌కు సూచించినట్లు సమాచారం. తెరాస వంటి పార్టీలో వచ్చే గుర్తింపు కన్నా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో ఉంటే గుర్తింపు వేరుగా ఉంటుందని దిగ్విజయ్ చెప్పినట్లు తెలిసింది. ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నందున ఇప్పుడు ఆ అనుబంధాన్ని తెంచుకోవద్దని, ఒకసారి పునరాలోచించుకోవాలని వివేక్‌కు దిగ్విజయ్ అన్నట్లు తెలుస్తోంది.
సోమవారం కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేయనున్నామని, కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకుని చెప్పాలని దిగ్విజయ్ స్పష్టం చేశారు. పార్టీలోకి తిరిగి వస్తే పెద్దపల్లి లోక్‌సభ స్థానం వివేక్‌కు ఖరారవుతుంది. అలాగే, సోదరుడు వినోద్‌కు కూడా అసెంబ్లీ స్థానం ఖాయమని దిగ్విజయ్ చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెరాస పార్టీ వైఖరితో అసంతృప్తిగా ఉన్న వివేక్, వినోద్ ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications