• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రపంచంలోనే అత్యంత సాహసోపేత యాత్రకు.. మన తెలుగు యువకుడు!

By Ramesh Babu
|

విశాఖపట్నం: నార్వే టూ స్వీడన్‌...300 కిలోమీటర్ల దూరం... మైనస్‌ 30 డిగ్రీల టెంపరేచర్‌లో ఏడు రోజుల యాత్ర...సైబీరియన్‌, అలస్కా జాతులకు చెందిన హస్కీ కుక్కలు లాగే స్లెడ్జ్ వాహనంలో ప్రయాణం.

ప్రపంచంలోనే అత్యంత సాహస యాత్రగా అందరూ భావించే ఓ యాత్రకు రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన డెంటల్‌ విద్యార్థి జయరాజ్‌ గేదెల దరఖాస్తు చేసుకున్నాడు. భారత్‌ ఉన్న రీజియన్‌లో టాప్‌-4లో నిలిచి తుది ఎంపికకు కొద్దిదూరంలో నిలిచాడు.

ఈ నేపథ్యంలో తనకు తెలుగు రాష్ట్రాల ప్రజలు మద్దతుగా నిలిచి ఓటు చేయాలని జయరాజ్‌ అభ్యర్థిస్తున్నాడు. ఆ యాత్రకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే పలు విషయాలను కూడా జయరాజ్ ఈ సందర్భంగా వివరించాడు.

జాల్ రేవెన్ పోలార్ పోటీలు...

జాల్ రేవెన్ పోలార్ పోటీలు...

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ జాల్ రేవెన్ పోలార్ పోటీలను స్వీడన్‌లో ఏటా నిర్వహిస్తారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు యేటా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకుంటారు. 1997 నుంచి నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనాలని భావించే వారికి పోటీల నిర్వాహకులు పెట్టే నియమాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే ముందే.. ఒకవేళ పోటీదారు చనిపోతే నిర్వాహకులకు ఎలాంటి సంబంధం లేదంటూ అంగీకర పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అయితే సరే.. ఈ పోటీలకు వేలల్లో ఎంట్రీలు వస్తుంటాయి. అలా వచ్చిన ఎంట్రీలనుంచి చివరికి 20 మందిని మాత్రమే నిర్వాహకులు ఎంపిక చేస్తారు.

ఎముకలు కొరికే చలిలో.. కుక్కలులాగే వాహనంపై...

ఎముకలు కొరికే చలిలో.. కుక్కలులాగే వాహనంపై...

ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైన తరువాత 300 కిలోమీటర్ల దూరం అంటే.. నార్వే నుంచి స్వీడన్ వరకు వారం రోజులపాటు ఎముకలు కొరికే చలిలో ప్రయాణించాల్సి ఉంటుంది. సైబీరియన్, అలస్కా జాతులకు చెందిన ఆరు నుంచి పది హస్కీ కుక్కలతో కూడిన స్లెడ్జెస్ వాహనంపై ఈ ఏడు రోజుల ప్రయాణాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రత్యేక శిక్షణ పొందిన ఈ కుక్కలు ఎముకలు కొరికే చలిలోనూ పరుగులు పెట్టగలుగుతాయి.

పోటీలకు ఎంపిక ఇలా...

పోటీలకు ఎంపిక ఇలా...

ప్రపంచాన్ని పది రీజియన్‌లుగా విడదీసి, ఒక్కో రీజియన్‌లో 20-30 దేశాలుంటే ఆయా దేశాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల్లో ఇద్దరిని మాత్రమే ఎంపిక చేస్తారు. దరఖాస్తుల్లో పొందుపరిచిన అంశాల ఆధారంగా మొదటి వ్యక్తిని జ్యూరీ సభ్యులు ఎంపికచేస్తారు. రీజియన్‌లో హయ్యస్ట్‌ ఓటింగ్‌ వచ్చిన వ్యక్తిని రెండో పోటీదారుగా ఎంపికచేస్తారు. ప్రస్తుతం భారత్ ఉన్న రీజియన్‌లో 30 దేశాలు ఉండగా పాకిస్తాన్‌కు చెందిన పోటీదారుడు మొదటి స్థానంలో ఉండగా, మన విశాఖపట్నం కుర్రాడు జయరాజ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. దీంతో ఓటింగ్ అనేది కీలకంగా మారింది. ఈ సమయంలో తనకు పడే ప్రతి ఓటు ఎంతో కీలకమని జయరాజ్ పేర్కొంటున్నాడు.

. ప్లీజ్.. ఓట్ ఫర్ మి...

. ప్లీజ్.. ఓట్ ఫర్ మి...

ఈ పోటీల్లో పాల్గొనే ఇతర దేశాల అభ్యర్థులకు ఆయా దేశాలకు చెందిన సెలబ్రిటీలు మద్దతు ఇస్తున్నారని, తనకు మాత్రం ఆ మద్దతు లేకుండా పోయిందని జయరాజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటివరకు నోయెల్‌, వైవా హర్షా, చాందినీ చౌదరి, మహాతల్లి, అనసూయ వంటివారి సపోర్ట్‌తో వందల మంది తనకు ఓటింగ్‌ చేశారని, మిగిలిన పెద్దలు కూడా సహకరిస్తే మంచి ఓటింగ్‌ సాధించి ఈ పోటీల్లో ముందుకెళ్లేందుకు అవకాశముంటుందని జయరాజ్ చెబుతున్నాడు. తన గెలుపు కోసం ఓట్ చేయాలనుకున్న వాళ్లు జయరాజ్ గేదెల ఫేస్‌బుక్ పేజీలోకి వెళ్లిగానీ లేదంటే లింక్ పై క్లిక్ చేయడం ద్వారాగానీ ఓటింగ్ చేయొచ్చని జయరాజ్ చెబుతున్నాడు. ఓటింగ్‌కు ఈ నెల 14 వరకు అవకాశం ఉందని, ఓటింగ్ చేయడం ద్వారా దేశం తరపున ఈ పోటీల్లో పాల్గొనబోతున్న మొట్టమొదటి వ్యక్తిగా అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నాడు.

మూడేళ్లుగా కసరత్తు...

మూడేళ్లుగా కసరత్తు...

స్వీడన్‌లో జరిగే ఈ జాల్ రేవెన్ పోలార్ పోటీల గురించి తనకు మూడేళ్ల క్రితమే తెలిసిందని, దాని గురించి మరింతగా తెలుసుకున్నాకే ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్నానని జయరాజ్ వివరిస్తున్నాడు. పోటీలు జరిగే ప్రాంతంలో వాతావరణానికి అలవాటుపడాలన్న ఉద్దేశంతో దేశంలో అలాంటి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఈ మూడేళ్లూ తిరిగాడట. మైనస్ టెంపరేచర్‌లో ఉండడంతోపాటు బైక్ రైడింగ్, తక్కువ మొత్తంతో కొన్ని రోజులపాటు బతకడం అలవాటుచేసుకున్నాడట. ఈ పోటీల్లో ఇప్పటి వరకు మన భారతదేశం తరుపున ఎవరూ పాల్గొనలేదని, గెలిస్తే ఏమిస్తారో కూడా తనకు తెలియదని, అయితే దేశం మొత్తం సగర్వంగా తలెత్తుకునేలా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఏడాది ఈ పోటీలకు దరఖాస్తు చేశానని జయరాజ్ చెబుతున్నాడు.

అక్కడ భారత జెండాను రెపరెపలాడించాలనే...

అక్కడ భారత జెండాను రెపరెపలాడించాలనే...

తనలో ఉన్న ఓ లోపాన్ని అధిగమించే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి సహసకృత్యాలు చేయడాన్ని అలవాటు చేసుకున్నానని జయరాజ్ తెలిపాడు. తాను నిష్టాగ్మస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని, దీని కారణంగా తాను ఎటువంటి క్లిష్టమైన, కష్టతరమైన పనులు చేయకూడని, తన కంటిపై ఒత్తిడి పడడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని చిన్నతనంలో వైద్యులు చెప్పారని వివరించాడు. తనలో ఉన్న లోపాన్ని తన సహచర విద్యార్థులు ఎత్తిచూపడాన్ని భరించలేకే దాన్ని అధిగమించే ఇలాంటి ప్రయత్నాలు చేశానని జయరాజ్ చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా మన భారతదేశ జెండాను స్వీడన్‌లో రెపరెపలాడించాలనే అతడి ఆశయం సిద్ధించాలని కోరుకుందాం.

English summary
“300km of Arctic wilderness. More than 200 highly skilled sled dogs and a group of ordinary people just like you. This is Fjällräven Polar, a journey you’ll never forget. Want in?” is what you read as you land on the homepage of Fjällräven Polar. While surviving the chilling weathers in our tropical climate is a demanding task for many, competing at the highest level in the intense climate of Arctic is a no mean feat. Much to the pride of many, a 21-year-old Visakhapatnam lad has dared to risk it all. Jayaraj Gedela is fighting it out to represent India and win glory at Fjällräven Polar 2018. The young dentist, however, requires our support to achieve his long time goal of winning laurels to the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X