ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వైవిధ్యమైన నటనతో అటు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అని తేడా లేకుండా భారీగా ఫ్యాన్స్ ను క్రియేట్ చేసుకున్నారు. ధనుష్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకుడు సైతం తెగ ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ధనుష్ సినిమాలో ఏదో ఒక కొత్తదనం, కంటెంట్, కథా నేపథ్యం డిఫరెంట్ గా ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. అందుకే హిట్, ప్లాఫ్ తో సంబంధం లేకుండా ధనుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి.

ఇక ధనుష్ గతేడాది కుబేర, ఇడ్లీ కొట్టు, తేరే ఇష్క్ మేన్ ఇలా ఏకంగా మూడు సినిమాలతో అలరించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది 'కర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రాన్ని విఘ్నేష్ రాజా తెరకెక్కించారు. ఈ మూవీలో బ్యాంకులను కొల్లగొట్టే ఓ దొంగ పాత్ర అయిన కర స్వామిగా ధనుష్ నటన ఆకట్టుకుంటుంది. సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు కొన్ని చోట్ల మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. ధనుష్ నటన, యాక్షన్ సన్నివేశాలు మంచి ప్రశంసలు అందుకున్నాయి.

Dhanush Latest Blockbuster Kara Arrives on OTT Streaming on Netflix from the 28th of This Month

అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్ లో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఈ మూవీని నెట్‌ ఫ్లిక్స్ పాన్ ఇండియా స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమాను మే 28 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+