ఎన్నికల వేళ కేంద్రం భారీ గిఫ్ట్ - విశాఖ కేంద్రంగా..!!
ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ నగరాల్లో విశాఖకు చోటు కల్పించింది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నాలుగు నగరాలను నీతి ఆయోగ్ ఎంపిక చేయగా అందులో వైజాగ్‌కు చోటు దక్కింది.. దక్షిణాది రాష్ట్రాల నుంచి విశాఖను ఎంపిక చేయగా, మిగతా వాటిలో ముంబై, సూరత్, వారణాసి ఉన్నాయి. వీటిని పైలట్ నగరాలుగా కేంద్రం ఎంచుకుంది.
2047 అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చేందుకు పైలట్ ప్రాజెక్టు ప్రవేశపెట్టగా, తాజాగా ఎంపికైన నాలుగు నగరాలలో పైలట్ ప్రాజెక్టు అమల్లోకి రానుంది. నీతి ఆయోగ్ ఎంపిక చేసిన నగరాల్లో భారీ ఎత్తున ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయనుంది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖఖ ఒకటని నీతి అయోగ్ గుర్తించింది. విశాఖు సహజ వనరులు కలిసొచ్చే అంశంగా పేర్కొంది. విశాఖలోని సహజ వనరులతో పాటుగా రైల్వే, పోర్టు కనెక్టివిటీలు, విమానాశ్రయం విశాఖ అభివృద్ధికి మరింత దోహపడుతాయని నీతి అయోగ్ పేర్కొంది. ఇప్పుడు నీతి అయోగ్ తీసుకున్న నిర్ణయం ద్వారా అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారం సుప్రీం పరిధిలో విచారణలో ఉండటంతో ముఖ్యమంత్రి వచ్చే నెల నుంచి విశాఖ కేంద్రంగా పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సిద్దవుతున్నారు. ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల వాతావరణం రాజకుంటోంది. కొద్ది రోజుల క్రితం ఇదే అంశంలో భాగంగా నీతి అయోగ్ సీఈవో సుబ్రమణ్యం విశాఖలో అధికారులో సమావేశం నిర్వహించారు. విశాఖ అభివృద్ధి ప్రణాళికల పైన చర్చించారు. నగర ప్రణాళిక, పర్యాటకం, విద్యా, ప్రజారోగ్యం, ఈ - గవర్నెన్స్ వంటి అంశాలపై సాధించిన ప్రగతిని సమీక్షించారు. పరిశ్రమలు, విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాల పరిస్థితలను తెలుసుకున్నారు.
విశాఖ నుంచే ఒడిశా, తెలంగాణ, కర్ణాటలకకు సంబంధించిన పలు ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నట్లు అధికారులు నివేదించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా బీచ్ రోడ్డులో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు పైన పరిశీలన చేసారు. నగర వ్యాప్తంగా మంచినీటి సరఫరా గురించి అధికారులు వివరించారు. ఇప్పుడు తీని అయోగ్ దక్షిణాదిన విశాఖకు మాత్రమే గ్రోత్ హబ్ నగరాల్లో అవకాశం ఇవ్వటం ద్వారా రానున్న రోజుల్లో నగరంలో అభివృద్ధి పరుగులు తీసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications