వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వృద్ధురాలి హత్య: తమ్ముడే పీక కోసి ప్రాణం తీశాడు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వ్యసనాలకు బానిసలై అప్పులపాలయ్యారు. అడ్డదారిలో సొమ్ము సంపాదించడానికి ఏ మాత్రం వెనుకాడరు. స్నేహితులు బంధువులే వారి టార్గెట్. డబ్బులొస్తాయంటే చాలు రక్త సంబంధమైనా వారికి లెక్కలేదు.
గత నెల 26న తగరపు వలసలో జరిగిన ఓ వృద్ధురాలి హత్యే కేసులో నిందితులు బాధితురాలికి దగ్గరవారేనని పోలీసులు దర్యాప్తులో తేలింది.

గురువారం ఇద్దరిని అరెస్ట్ చేసి భీమిలి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 52.25 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నగర్ క్రైం డీసీపీ రవికుమార్ మూర్తి జిల్లాకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీవీ మెకానికి మావూరి చక్రధర్ అలియాస్ చక్రి దువ్వాడ రాజీవ్ నగర్‌లో నివసిస్తున్నాడు. మాల్కాపురం ప్రకాష్ నగర్‌లో నివసిస్తున్న పొట్నూరు వెంకట్రావు అలియాస్ పెద్ద అతనికి స్నేహితుడు.

 వృద్ధురాలి హత్యను ఛేదించిన పోలీసులు

వృద్ధురాలి హత్యను ఛేదించిన పోలీసులు


వీరు చెడు వ్యసనాలకు బానిసలై అప్పులుపాలయ్యారు. ఎలాగైనా ఖర్చులకు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గత నెల ఇద్దరు స్నేహితుల ఇళ్లలో చోరీలకు యత్నించారు. ఆ యత్నాలు బెడిసికొట్టడంతో వెంకట్రావు తగరపు వలసలోని తన అక్క ఇంటికి తీసుకెళ్లాడు.

వృద్ధురాలి హత్యను ఛేదించిన పోలీసులు

వృద్ధురాలి హత్యను ఛేదించిన పోలీసులు


బావ ఆఫీసుకు వెళ్లాక అక్క ఒంటరిగా ఉన్నప్పుడు ఇల్లు దొచుకోవాలన్నది వారి ప్లాన్. నిందితులు 25వ తేదీన అక్కడకు చేరుకున్నారు. తెలిసినవారింట్లో దొంగతనం చేస్తే బయటపడిపోతుందని వెనక్కి వచ్చేశారు.

వృద్ధురాలి హత్యను ఛేదించిన పోలీసులు

వృద్ధురాలి హత్యను ఛేదించిన పోలీసులు


మల్లీ మర్నాడు మార్కెట్‌లో చాకు కొనుక్కొని మధ్యాహ్నాం అక్క ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె బజారుకి వెళ్లడంతో ఇంట్లో ఆమె ఆత్త అచ్చియ్యమ్మ ఒక్కరే ఉన్నారు. కబుర్లు ఆడుతూ ఎవరూ లేని సమయం చూసి నైలాన్ తాడు మెడకు బిగించి లాగటంతో ఆమె సొమ్మసిల్లిపోయింది.

 వృద్ధురాలి హత్యను ఛేదించిన పోలీసులు

వృద్ధురాలి హత్యను ఛేదించిన పోలీసులు

ఆమె చేతికి గల 4 బంగారు గాజులు, ఒక జత చెవి దిద్దులు, ఒక జత ఎత్తుగొలుసులు దొంగిలించారు. తెలివి వచ్చాక గుర్తు పడుతుందన్న భయంతో చాకుతో ఆమె పీక కోసి ప్రాణం తీసారు. భీమిలి పోలీసులు కీలక సమాచారం మేరకు నిందితులను గుర్తించి, అరెస్ట్ చేశారు. సింగపూర్‌లో ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేసినట్టు నిందితుడు వెంకటరావుపై గతంలో మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

English summary
The city police nabbed two accused today, for being allegedly involved in the murder of a 65-year-old woman, a police official announced here today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X