బాలికపై 2 ఏళ్లుగా పూర్ణానంద స్వామీజీ అత్యాచారం!

స్వామీజీ రెండు సంవత్సరాలుగా తనపై అత్యాచారం చేస్తున్నారని అనాథ బాలిక ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. స్పందించిన పోలీసులు వెంటనే సదరు స్వామీజీని అరెస్ట్ చేశారు. రాజమండ్రికి చెందిన ఓ బాలిక (15) చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. 5వ తరగతి వరకు చదివించిన బంధువులు విశాఖపట్నంలోని కొత్త వెంకోజీపాలెం దగ్గర ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించారు. ఆవులకు మేత వేయడం, పేడ తీయడం లాంటి పనులు చేసేది.

అర్థరాత్రి దాటిన తర్వాత : అర్థరాత్రి దాటిన తర్వాత ఆ బాలికను స్వామీజీ గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారాన్ని పాల్పడేవాడు. ఎదురు తిరగకుండా ఉండేందుకు ఆ బాలిక కాళ్లను గొలుసులతో బంధించేవాడు. నీటిలో రెండు స్పూన్ల అన్నాన్ని మాత్రమే పెట్టేవారు. స్నానం కూడా రెండు వారాలకు ఒకసారే. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా స్వామీజీ అనుమతించేవాడు కాదు.. అన్నీ బకెట్ లోనే కానివ్వమనేవాడు. ఇలా రెండు సంవత్సరాలుగా చిత్రహింసలకు గురిచేశాడు.

poornanandaswamiji

పనిమనిషి సాయంతో : ఈ నెల 13వ తేదీన పనిమనిషి సాయంతో బాధిత బాలిక ఆశ్రమం నుంచి బయటపడింది. విశాఖలో తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కి తనకు పరిచయమైన ప్రయాణికురాలికి బాధ చెప్పుకుంది. రెండురోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని హాస్టల్ లో చేర్చేందుకు ప్రయత్నించింది. అయితే పోలీస్ స్టేషన్ నుంచి లేఖ తీసుకురావాలని వారు సూచించడంతో కంకిపాడు స్టేషన్ కు వెళ్లారు. లేఖను తీసుకొని బాలల సంక్షేమ కమిటీకి ఆ బాలికలను తీసుకువెళ్లగా తాను అనుభవించిన నరకాన్ని వారికి చెప్పింది.

విజయవాడలో వైద్యపరీక్షలు : ఆ బాలికను వైద్యపరీక్షల కోసం విజయవాడలోని పాత ప్రభుత్వాస్పత్రికి పంపించారు. పూర్ణానందస్వామీజీపై పోక్సో కేసు నమోదైంది. తన ఆశ్రమానికి సంబంధించిన భూములను కొట్టేయాలని చూస్తున్నారని, వారి కుట్రలో భాగంగానే ఇలా జరిగిందని స్వామీజీ చెప్పారు. తాను న్యాయపోరాటం చేస్తానన్నారు. తమ ఆశ్రమంలో ఉండే బాలిక అదృశ్యమైందని ఆశ్రమ నిర్వాహకులు ఈనెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+