వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓడలకు దిశానిర్దేశం: విశాఖ పాత్ లైట్ హౌస్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలోని చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నగర ప్రజలపై ఉందని పోర్టు ఛైర్మన్ కృష్ణబాబు అన్నారు. బీచ్‌రోడ్డులోని ఫోర్ట్ ప్లాగ్ వద్ద పునరుద్ధరించిన పాత్ లైట్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఓడరేవు అభివృద్ధి చెందక ముందే విశాఖ సముద్రయానానికి పేరు గాంచిందని అన్నారు. సముద్ర మార్గం ద్వారా విశాఖకు వచ్చే ఓడలకు దిశానిర్దేశం చేసేందుకు 1903లో ఈ లైట్ హౌస్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు.

ఆ తర్వాత కాలంలో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో డాల్ఫిన్స్ నోస్‌పై కొత్త లైట్ హౌస్‌ను నిర్మించారని చెప్పారు.

 చారిత్రక కట్టడంగా విశాఖ లైట్ హౌస్

చారిత్రక కట్టడంగా విశాఖ లైట్ హౌస్


అప్పటి నుంచి పాత లైట్ హౌస్ వాడకాన్ని నిలిపివేశారని, విశాఖ కంటెయినర్ టెర్మినల్ సంస్ధ సామాజిక బాధ్యతగా పాత లైట్ హౌస్‌ను పునరుద్ధరించి పర్యాటకుల కోసం సిద్ధం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

 చారిత్రక కట్టడంగా విశాఖ లైట్ హౌస్

చారిత్రక కట్టడంగా విశాఖ లైట్ హౌస్


పూర్వ రోజుల్లో లైట్ హౌస్ నావికులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుని దానికి అనుగుణంగా దీనిని తీర్చిదిద్దినందుకు అభినందనలు తెలిపారు.

చారిత్రక కట్టడంగా విశాఖ లైట్ హౌస్

చారిత్రక కట్టడంగా విశాఖ లైట్ హౌస్


విశాఖ కంటెయినర్ టెర్మినల్ మేనేజింగ్ డైరెక్టర్ వీర్ కోటక్ మాట్లాడుతూ పాత లైట్ హౌస్‌ను పునరుద్దరించేందుకు తమకు సహాయంగా నిలిచిన పోర్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

 చారిత్రక కట్టడంగా విశాఖ లైట్ హౌస్

చారిత్రక కట్టడంగా విశాఖ లైట్ హౌస్


ఈ కార్యక్రమంలో పోర్టు అధికారులు, కంటెయినర్ టెర్మినల్ సంస్ధ అధికారులు, సిబ్బంది, స్ధానికులు పాల్గొన్నారు.

 చారిత్రక కట్టడంగా విశాఖ లైట్ హౌస్

చారిత్రక కట్టడంగా విశాఖ లైట్ హౌస్

విశాఖ పోర్టు ట్రస్ట్‌కు చెందిన వాడుకలో లేని ఈ లైట్‌హౌస్‌ను పర్యాటకుల సందర్శనకు అనుకూలంగా తీర్చిదిద్దే పనులు పూర్తయయ్యాయి. లైట్‌ హౌస్‌ చుట్టూ పార్క్‌ను అభివృద్ధి చేశారు.

English summary
The Visakhapatnam Port Trust and the Visakha Container Terminal (VCTPL) have restored the old lighthouse on the beach road here. The heritage structure was thrown open to the public on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X