రియల్ కోవిడ్ వారియర్స్.. అయినవాళ్లే దగ్గరికి రాని వేళ... అంతా తామై మృతదేహాలకు అంత్యక్రియలు...
కరోనా సోకిందంటే చాలు అయినవాళ్లే దగ్గరికి రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఆఖరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కొన్ని కుటుంబాలు ముందుకు రావట్లేదు. దీంతో అందరూ ఉండి కూడా దిక్కు లేని అనాథ శవాలుగా మారుతున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా విస్పోటనానికి మానవత్వం కూడా మంట కలిసిపోతున్న వేళ... కొన్ని స్వచ్చంద సంస్థలు మాత్రం తాము ఉన్నామంటూ భరోసా ఇస్తున్నాయి. ఏ సంబంధం లేకపోయినా కేవలం మానవతా దృక్పథంతో కరోనా పేషెంట్ల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి. తాజాగా అనంతపురం,చిత్తూరు జిల్లాల్లో కరోనాతో చనిపోయిన ఇద్దరి మృతదేహాలకు స్వచ్చంద సంస్థలే అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించాయి.

అనంతలో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్...
అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రానికి చెందిన దాసరి శ్రీనివాసులు అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం(మే 14) ఉదయం మృతి చెందాడు. అయితే అతని అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో శ్రీనివాసులు కుమారుడు యాడికి పట్టణంలోని 'మే ఐ హెల్ప్ యు' ఫౌండేషన్‌ను సంప్రదించాడు. ఆ సంస్థ సెక్రటరీ మహానంద రెడ్డితో మాట్లాడి పరిస్థితి వివరించాడు. దీంతో శ్రీనివాసులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు మహానంద రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకొచ్చాడు. తనతో పాటు ఫౌండేషన్ సభ్యులతో కలిసి శ్రీనివాసులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాడు.యాడికి పట్టణంలోని బుగ్గ రోడ్డు లో ఉన్న హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఎవరైనా సంప్రదించవచ్చు...
ఈ
సందర్భంగా
'మే
ఐ
హెల్ప్
యు'
పౌండేషన్
నిర్వాహకులు
మాట్లాడుతూ...
యాడికి
మండలంలోని
ఏ
గ్రామంలోనైనా,
ఎక్కడైనా
అనాథ
శవాలు
ఉన్నా...
లేక
ఏ
కారణాల
వలన
మృతులకు
అంత్యక్రియలు
నిర్వహించేందుకు
కుటుంబ
సభ్యులు
ముందుకు
రాకపోయినా
తమను
సంప్రదించవచ్చునని
తెలిపారు.మానవతా
దృక్పథంతో
ఈ
కార్యక్రమం
చేపడుతున్నట్లు
ఫౌండేషన్
ప్రెసిడెంట్
బండారు
బాలకృష్ణ,
సెక్రటరీ
బొర్రా
మహానంద
రెడ్డి
తెలిపారు.
చిత్తూరులో కోవిడ్ మృతురాలికి ఫౌండేషన్ అంత్యక్రియలు
చిత్తూరు జిల్లాలోని పీలేరులోనూ ఓ స్వచ్చంద సంస్థ నిర్వాహకులు ఓ కరోనా పేషెంట్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. పీలేరు సైనిక్ నగర్‌కు చెందిన జుబేదా(65) గురువారం(మే 13) కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె మృతి చెందారు. ఆర్నెళ్ల క్రితమే ఆమె భర్త గుండెపోటుతో చనిపోయారు. జుబేదా అంత్యక్రియలకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పీలేరు పోలీసుల సాయంతో స్థానికులు 'మేము సైతం సమాజం కోసం ఫౌండేషన్'ను సంప్రదించారు. ఫౌండేషన్ సభ్యులు ముందుకు వచ్చి జుబేదా మృతదేహానికి బిలాల్ మసీద్ సమీపంలోని కబ్రస్తాన్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.
పండుగను సైతం పక్కనపెట్టి...
మేము సైతం సమాజం కోసం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ షాహిన్ షా మాట్లాడుతూ.. ముస్లింలకు రంజాన్ అత్యంత పవిత్రమైన పండుగ అయినప్పటికీ,పండుగ సైతం జరుపుకోకుండా నిరంతర సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే ముస్లిం మహిళ జుబేదాకు అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. ఇందుకు తమకు చాలా సంతోషంగా ఉందని.. ఇలాంటి సేవా కార్యక్రమాలను తాము చాలా పవిత్రంగా భావిస్తున్నామని తెలిపారు. జుబేదా అంత్యక్రియల్లో పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ షాహిన్ షా, గ్యాస్ షఫీ, బిల్లు అలియాస్ శంషీర్, మృతురాలి బంధువులు షేక్ మహమ్మద్ ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.