వోల్వో బస్సులో మంటలు, దగ్ధం: రైలులో భారీ దోపిడీ

Volvo Bus catches fire in Medak district
మెదక్/గుంటూరు: మెదక్ జిల్లా కుకునూరుపల్లి మండలం కొండపాక శివారులో ఆర్టీసీ వోల్వో బస్సులో మంటలు వ్యాపించడంతో దగ్ధమైంది. ఫైరింజన్ వచ్చేలోగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. కొమురవెల్లి కమాన్ వద్ద బస్సు డ్రైవర్ మంటలు గుర్తించాడు. వెంటనే బస్సు ఆపివేసి చాకచక్యంతో వైర్లు తెంచి వేశాడు. ప్రయాణికులను బస్సు నుంచి దించివేశారు.

అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బస్సులో 41 మంది ప్రయాణీకులు ఉన్నారు. అందరు సురక్షితంగా ఉన్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాదు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణీకుల ల్యాప్‌టాప్‌లు, ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి.

రైలు దోపిడీ

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ సమీపంలోని తుమ్మల చెరువు వద్ద చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున 2.10గంటల సమయంలో జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న సుమారు 10 మంది దుండగులు తుమ్మలచెరువు వద్ద చైన్ లాగి రైలుని నిలిపి వేశారు.

అనంతరం దుండగులు రైల్లో నుంచి దిగి కిటికీ పక్కన ఉన్న ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో బంగారం, నగదు దోచుకున్నారు. ఎస్-5, ఎస్-9, ఎస్-11, ఎస్-12 బోగీలలో ఈ దోపిడీ జరిగింది. దీంతో రైలు అరగంటకు పైగా నిలిచిపోయింది. రైలు సికింద్రాబాద్ చేరుకున్న అనంతరం దోపిడీకి గురైన ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు దోపిడీకి గురైన ప్రదేశాన్ని పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+