వోల్వో: జెసి అరెస్ట్ కోసం ధర్నా, కేజ్రీవాల్ పార్టీ సపోర్ట్
హైదరాబాద్: అక్టోబర్ 30వ తేదిన జరిగిన మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు ప్రమాద బాధితులు శుక్రవారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఆరని మంటలు పేరుతో దీక్షకు దిగారు. ప్రమాదానికి గురైన బస్సు యజమాని జెసి ప్రభాకర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశాయి. ఈ ధర్నాలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా పాల్గొని బాధితులకు అండగా నిలబడ్డారు.
కాగా, అక్టోబర్ 30వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో జాతీయ రహదారి పైన జరిగిన వోల్వో బస్సు ప్రమాదం ఘటనలో 45 మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. దీనిని ప్రభుత్వం సిఐడి విచారణకు అప్పగించింది.

బస్సులో సజీవ దహనమైన వారు మంటలు అంటుకున్న రెండు నిమిషాల్లోనే మరణించినట్లుగా క్లూస్ టీం నిర్ధారించింది. మంటలు వ్యాపించిన క్షణాల్లోనే కార్పన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ పెద్ద ఎత్తున ఉత్పత్తయ్యాయి.

దీంతో గాఢనిద్రలో ఉన్న ప్రయాణీకులు మేల్కొనేసరికి ఆ రెండు వాయువులు బస్సు అంతటా వ్యాపించాయి. దీంతో వారు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. బస్సులోకి ఆక్సిజన్ అందలేదు. ఆ స్థితిలో ఎవరైనా ఒకటి రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు బతకడం అసాధ్యమని, అద్దాలు పగులగొట్టి ఉంటే ఆక్సిజన్ సరఫరా జరిగి చాలామంది బతికే వారని, ఆ అవకాశం లేకపోవడంతో మంటలు తీవ్రత పెరగకముందే అంతా మృత్యువాత పడ్డారు.












Click it and Unblock the Notifications