కొనసాగుతున్న క్యూ లైన్లు, పోలింగ్ శాతం - పార్టీల్లో కొత్త టెన్షన్..!!
ఏపీలో పోలింగ్ సమయం ముగిసింది. కానీ, పోలింగ్ కేంద్రాలవద్దఇంకా క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. నిర్దేశిత సమయం లోగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల్లోనూ రాత్రి వరకు ఇదే తరహాలో పోలింగ్ కొనసాగింది. ఇప్పుడు నాటి పోలింగ్ శైలిని గుర్తు చేస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో ఇంకా ఓటు వేసేందుకు క్యూ లైన్ లో ఉన్నారు. దీంతో..ఈ ఓటింగ్ ఎవరికి కలిసి వస్తుంది..ఎవరికి నష్టం చేస్తుందనే టెన్షన్ మొదలైంది.
పోలింగ్ సమయం ఆరు గంటలకు ముగిసింది. అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దాదాపు 68.01 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ పూర్తయిన తరువాతనే పూర్తిస్పష్టత వచ్చే అవాకశం కనిపిస్తోంది. అల్లూరి సీతారామరాజు మన్యం 55.17 శాతం, అనకాపల్లి 65.97, అనంతపురం 68.04, అన్నమయ్య 67.63, బాపట్ల 72.14, చిత్తూరు 74.06, కోనసీమ 73.55, తూర్పు గోదావరి 67.93, ఏలూరు 71.10, గుంటూరు 65.58, కాకినాడ 65.01, కృష్ణా 73.53, కర్నూలు 64.55, నంద్యాల 71.43, ఎన్‌టీఆర్ 67.44, పల్నాడు 69.10, పార్వతిపురం 61.18 శాతం పోలింగ్ నమోదలైంది.

అదే విధంగా..ప్రకాశం 71.00, నెల్లూరు 69.95, శ్రీసత్యసాయి 67.16, శ్రీకాకుళం 67.48, తిరుపతి 65.88, విశాఖపట్నం 57.42, విజయనగరం 68.16, పశ్చిమ గోదావరి 68.78, కడప 72.85 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు స్పష్టం చేసారు.

ఉదయం నుంచి గ్రామీణ ప్రాంతంలో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో కనిపించారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న పార్టీలు పూర్తి సమాచారం సేకరిస్తున్నాయి. క్షేత్ర స్థాయి నుంచి నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళి పైన ఆరా తీసారు. ఏ నియోజకవర్గంలో ఎక్కడ తమకు అనుకూలంగా ఉందనే అంశం పైన కసరత్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications