రండిబాబు రండి, ఆలస్యం అమృతం విషం, టీడీపీ, వైసీపీ పక్కాప్లాన్, ఆ ఓటర్లపై కోటీ ఆశలు !
ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్లు వెయ్యడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఓటును తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, 25 లోక్ సభ నియోజక వర్గాల్లో సోమవారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో ఓటర్లు ఓటు వెయ్యడానికి క్యూలో నిలబడుతున్నారు.
ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన లక్షలాది మంది ఓటర్లు పొరుగున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. గత మూడు నాలుగు రోజుల క్రితమే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఓటర్లు వారి సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. సోమవారం కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి చిత్తూరు జిల్లాకు వేలాది మంది ఓటర్లు చేరుకుంటున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, నగిరి, చిత్తూరు, పుంగనూరు, మదనపల్లె, తంబళపల్లె, పీలేరు, వాల్మీకిపురం, బి కొత్తకోట, కుప్పం, పలమనేరు తదితర నియోజక వర్గాల ప్రజలు చాలా సంవత్సరాల నుంచి బెంగూరు, చెన్నైలో స్థిరపడి ఉన్నారు. ఇలాగై హైదరాబాద్ లో కూడా వేలాది మంది ఓటర్లు ఉన్నారు. అయితే వీళ్ల ఓట్లు మాత్రం వారివారి సొంత నియోజక వర్గాల్లోనేని పట్టణాలు, గ్రామాల్లోనే ఉన్నాయి.
దూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లను సొంత ప్రాంతాలకు పిలిపించుకుని తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలని టీడీపీ, వైసీపీ నాయకులు గత వారం రోజుల నుంచి అనేక ప్రయత్నాలు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో ఉంటున్న వాళ్లు సొంత నియోజక వర్గాలకు వచ్చి ఓట్లు వేసి వెళ్లడానికి అయ్యే ఖర్చులను భరించడానికి అన్ని పార్టీల నాయకులు సిద్దం అయ్యారు.

ముఖ్యంగా బెంగళూరు, చెన్నైలో నివాసం ఉండే యువతను ఆకర్షించడానికి వైసీపీ, టీడీపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేట లోక్ సభ నియోజక వర్గం నుంచి మాత్రమే బీజేపీలో బరిలో ఉండటం, మిగిలిని అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ, వైసీపీ బరిలో ఉండటంతో ఆ పార్టీల నాయకులు, వారి అనుచరులు బెంగళూరు, చెన్నైలో ఉండే యువతకు స్వయంగా ఫోన్లు చేసి వారి నియోజక వర్గాలకు పిలిపించుకుని వారికి అనుకూలంగా ఓట్లు వేయించుకుంటున్నారు.
బెంగళూరులోని ఇట్టుమడు ప్రాంతానికి మిని చిత్తూరు అనే పేరు ఉంది. చిత్తూరు, తిరుపతి, జీడీ నెల్లూరు, పుత్తూరు ప్రాంతాల నుంచి బెంగళూరులోని ఇట్టుమడు ప్రాంతానికి డైరెక్టు బస్సులు నడుపుతున్నారు. శనివారం, ఆదివారం టీడీపీ, వైసీపీ నాయకులు ఇట్టుమడు నుంచి ప్రత్యేకంగా ప్రైవేటు బస్సులు పెట్టి ఓటర్లను చిత్తూరు, పుత్తూరు, కుప్పం ప్రాంతాలకు ఓటర్లను పిలిపించుకున్నారు. అలాగే వారు మళ్లీ బెంగళూరు వెళ్లడానికి సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఒక్క ఓటు కూడా జారిపోకుండా టీడీపీ, వైసీపీ నాయకుు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications