స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాల్లో కోత, తాజా నిర్ణయంతో ఇక..!!
విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం ప్లాంట్ తిరిగి నిలబడే విధంగా ఆర్దిక సాయం ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఉండదని కూటమి నేతలు తేల్చి చెప్పారు. అయితే, ప్లాంట్ లో నిర్ణయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఉద్యోగుల జీతాల విషయంలో యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాల పై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జనవరి 1న వేతనాల విషయంలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఆనందం లేకుండా పోయింది. యాజమాన్యం నిర్దేశించిన ప్రకారం 100 శాతం ఉత్పత్తి తీసినా పాత సీఎండీ సక్సేనా ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వకుండా కోత పెట్టారు. అవి కూడా ఒకటో తేదీన ఇవ్వకుండా చేశారు. ఆయన ఎంఓఐఎల్‌లో డిసెంబరు 31న పదవీ విరమణ చేశారు. అక్కడ వేడుకల కోసం ముందుగానే వెళ్లిపోయారు. నవంబరు నెల మాదిరిగానే డిసెంబరు నెలకు కూడా ఉత్పత్తి ఆధారిత జీతాలే ఇవ్వాలంటూ ఉత్తర్వులు ఇచ్చి వెళ్లిపోయారు. వాస్తవానికి డిసెంబరులో ఉద్యోగులు అనేకసార్లు లక్ష్యానికి మించి ఉత్పత్తి తీశారు. అయితే కొన్ని విభాగాల్లో తగిన వనరులు లేక అందుబాటులో ఉన్నంత మేరకు ఉత్పత్తి సాధించారు. దాంతో ఒక్కో విభాగానికి ఒక్కోలా జీతాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. బ్లాస్ట్ ఫర్నేస్ విభాగాల్లో పనిచేసే వారికి 96 శాతం ఇస్తున్నట్లు సమాచారం రోలింగ్ మిల్స్‌లో పనిచేసే వారికి 82 శాతమే ఇవ్వడానికి పత్రాలు తయారుచేశారు.

కాగా, నాణ్యమైన కోక్ అందుబాటులో లేక ఆ విభాగంలో పుషింగ్స్ తగ్గిపోతున్నాయి. దాంతో వాయువులు కూడా తక్కువగా వస్తున్నాయి. ఆ మేరకు రోలింగ్ మిల్స్ అన్నింటినీ కాకుండా ఒకసారి నాలుగు, మరోసారి ఐదు చొప్పున నడుపుతున్నారు. దాంతో అక్కడ 100 శాతం ఉత్పత్తి రాలేదు. పనిచేయడానికి ఉద్యోగులు ప్లాంటులోనే పూర్తి సమయం ఉన్నా, వాయువులు లేక వీలు కాలేదు. దానికి లక్ష్యం మేరకు ఉత్పత్తి లేదంటూ వారి జీతాల్లో కోత పెట్టారని ఉద్యోగ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విధానం రాజ్యంగబద్ధం కాదని, డిపార్టుమెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (డీపీఈ) ఫిర్యాదు చేశామని, అక్కడి నుంచి వివరణ కోరినా, ఇక్కడి సీఎండీ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో వాటిని ఖాతరు చేయకుండా ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించి, ఉత్పత్తి ఆధారిత జీతాలే మళ్లీ మంజూరుచేశారని వాపోతున్నారు. దీంతో, కొత్తగా వచ్చే సీఎండీ పైనా ఉద్యోగులు భారీ ఆశతో ఉన్నారు. దీంతో.. రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications