బ్యాడ్ గయ్స్‌కు బ్యాడ్ న్యూస్: నారా లోకేష్‌కు బిగ్ షాక్..!!
Vyuham: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని రెండు భాగాలుగా తెరకెక్కింది సినిమా. దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. నవంబర్ 10వ తేదీన ఫస్ట్ పార్ట్ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ..అది వాయిదా పడింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపుదిద్దుకుంది. వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్ పోషించాడు. వైఎస్ భారతి క్యారెక్టర్‌లో మానస రాధాకృష్ణన్ నటించారు. ఈ సినిమా షూటింగ్.. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

వ్యూహం సినిమాను అడ్డుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనేక వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని, అవాస్తవాలను తెరకెక్కించారంటూ ఆయన సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు.
ఈ లేఖ తరువాత ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ అనుమతి ఇవ్వలేదు. రివైజింగ్ కమిటీకి రెఫర్ చేసింది. రివైజింగ్ కమిటీ సినిమా చూసి, సర్టిఫై చేసిన తరువాత విడుదల అవుతుంది. ఈ విషయాన్ని అప్పట్లోనే రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు కూడా. రివైజింగ్ కమిటీ సినిమా చూసి, సర్టిఫై చేసిన తరువాత విడుదల అవుతుందని అన్నారు.
ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. రివైజ్ కమిటీ సభ్యుడు ప్రియాంక దీక్షిత్, వాణి హరికృష్ణ, ఆశా జగదీష్, వేదా భట్, అర్చన రావ్, సాయి దత్త వంశీ, అశోక్ బీఎస్, గణపతి భట్, హరీష్ కుమార్, టీఎస్ నాగాభరణ ఈ సినిమాను చూశారు. సర్టిఫికెట్ జారీ చేయడానికి అనుమతి ఇచ్చారు. సీబీఎఫ్‌సీ రీజినల్ ఆఫీసర్ షిఫాలీ కుమార్.. ఈ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. మొత్తం సినిమా రన్ టైమ్ 126.09 సెకెండ్లు.
ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సెన్సార్ సర్టిఫికెట్‌ను పట్టుకుని దిగిన ఓ ఫొటోను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గయ్స్, వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ అంటూ కామెంట్స్ పెట్టారు. డిసెంబర్ 29వ తేదీన విడుదల కానున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications