జగన్ ఓ సైకో.. చిరంజీవి చేసింది ఏం లేదు.. ఓ రేంజ్‌లో బాలయ్య ఫైర్
టాలీవుడ్ సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వంతో పాటు, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై బాలయ్య తనదైన శైలిలో రెచ్చిపోయారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడుతూ.. జగన్ సైకో అని సంబోధించారు. ఇదే సమయంలో కూటమి ఎమ్మెల్యే, మంత్రులపై కూడా బాలయ్య రెచ్చిపోయారు.
మాజీ మంత్రి కామినేని, మంత్రి కందుల దుర్గేష్‌లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కామినేని అసెంబ్లీ వేదికగా అంతా అబద్దాలు చెప్పారని బాలకృష్ణ వెల్లడించారు. చిరంజీవి గట్టిగా చెప్పడం వల్లే జగన్ సినిమా ఇండస్ట్రీ వాళ్లను కలిశారని చెప్పడం మంత్రి కామినేని చెప్పడం అవాస్తమని బాలకృష్ణ తేల్చేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడడానికి సినీ పరిశ్రమ నుంచి కొందరు జగన్‌ను కలవడం జరిగింది.ఆ సమయంలో చిరంజీవి నేతృత్వంలో కొందరు అప్పటి సీఎం జగన్‌ను కలిశారు. ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, మొదలగు వారు జగన్‌ను కలిశారు. ఆ సమయంలో హీరోలను జగన్ అవమానించారని కూటమి నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

ఆ రోజు జగన్ హీరోలను కలవడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదని, చిరంజీవి గట్టిగా చెప్పడం వల్లే ఆ రోజు సినీ ఇండస్ట్రీ పెద్దలను జగన్ కలిశారని కామినేని చెప్పుకొచ్చారు.చిరంజీవి చొరవ వల్లే ఇదింతా జరిగిందని కామినేని చెప్పడంతో బాలయ్య ఒకింత అసహనం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలంటూ కామినేనిపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో జనసేన మంత్రి కందుల దుర్గేష్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కమిటీలో తనది 9వ పేరుగా ప్రచురించారని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటివి చూసుకోవాలంటూ మంత్రికి చురకలు అంటించారు. అసెంబ్లీలో బాలకృష్ణ సొంత కూటమి ఎమ్మెల్యే , మంత్రులపై ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications