ఏపీలో పవర్ స్టార్ బ్రాండ్ విస్కీపై రచ్చ... పవన్ కళ్యాణ్ వీడియోతో వైసీపీ ప్లాన్ బూమరాంగ్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి వైసీపీ నేతలు అదను కోసం ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి సిద్ధమవుతున్న వైసిపికి తాజాగా ఒక కొత్త ఆయుధం దొరికింది. ఏపీలో 999 పవర్ స్టార్ సుపీరియర్ పేరుతో కొత్త విస్కీ అందుబాటులోకి వచ్చిందని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.

ఏపీలో పవర్ స్టార్ విస్కీ రచ్చ
ఏపీలో 999 పవర్ స్టార్ సుపీరియర్ విస్కీపై స్పందించిన వైసిపి కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ విస్కీ పేరుతో కొత్త బ్రాండ్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిందని విమర్శలు గుప్పించింది. నాణ్యమైన మద్యం అంటూ జనసైనికులను మెప్పించేలా ఈ బ్రాండ్ ను తెచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పేరును టార్గెట్ చేసింది.

War over power star brand whiskey in AP YCP plan boomerang with Pawan Kalyan video

జనసైనిక్స్ కోసం పవర్ స్టార్ బ్రాండ్: వైసీపీ వ్యంగ్యం
అంతేకాదు గతంలో 'ఛీ'డీపీ కార్యకర్తల కోసం లెజెండ్ బ్రాండ్ తెచ్చిన అదే ప్రభుత్వం ఇప్పుడు జనసైనిక్స్ కోసం పవర్ స్టార్ బ్రాండ్ అందుబాటులోకి తెచ్చిందని ఎద్దేవా చేసింది. ముఖ్యగమనిక .. ఏపీలో మాత్రమే ఈ " నాణ్యమైన మద్యం " బ్రాండ్ అందుబాటులో ఉంటది అంటూ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తుంది.

ఘాటుగా రిప్లై ఇస్తున్న టీడీపీ, జనసేన
ఇక దీనికి టిడిపి జనసేన ఘాటుగానే వైసిపికి బదులిచ్చాయి. టిడిపి ప్రభుత్వం ఎటువంటి లిక్కర్ బ్రాండ్ ను తీసుకు రాలేదని ఈ లిక్కర్ బ్రాండ్ల పుణ్యమంతా వైసీపీ దేనని మండిపడుతున్నారు. ఇక ఈ బ్రాండ్ పై గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో తో టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రపంచంలోనే ఎక్కడా దొరకనటువంటి డేంజరస్ లిక్కర్ ను తీసుకువచ్చింది వైసిపి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ బ్రాండ్లు తెచ్చింది మీరే
త్రి క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, బూమ్ బూమ్, 999 పవర్ స్టార్ బ్రాండ్ మద్యం తీసుకువచ్చింది వైయస్ జగన్మోహన్ రెడ్డి నే అని, ఈ విషయం జనాలకు తెలియదు అనుకొని టిడిపి కూటమి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎదురు దాడి చేస్తున్నారు. జగనే విషపు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ నిప్పులు చెరిగారు టిడిపి జనసేన కార్యకర్తలు.

బురద చల్లేందుకే ఈ విష ప్రచారం
అంతేకాదు బురద చల్లడం కోసమే ప్రస్తుత ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో దిక్కుమాలిన మద్యం బ్రాండ్లతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను తీసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం తీసుకు వచ్చిందని ప్రచారం చేస్తున్న లిక్కర్ బ్రాండ్ జగన్ తీసుకువచ్చిందేనని తేల్చి చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+