మాటల యుద్దం: ఎన్నికల కోసమే పోలవరం స్పిల్‌వే పనులు: బిజెపి, ఏపీపై కేంద్రం పోలీసింగ్: టిడిపి
అమరావతి: ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధుల విడుదల విషయమై టిడిపి , బిజెపి నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.శాసనమండలిలో టిడిపి, బిజెపి ఎమ్మెల్సీల మధ్య బుధవారం నాడు మాటల యుద్దం సాగింది.
ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయమై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి అసంతృప్తిగా ఉంది. బిజెపితో పొత్తు విషయమై అమీతుమీ తేల్చుకోవాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాన్ని సేకరించారు.
శాసనమండిలో టిడిపి, బిజెపి ఎమ్మెల్సీల మధ్య బుధవారం నాడు వాగ్వావాదం చోటు చేసుకొంది. టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ మధ్య నిదుల కేటాయింపు విషయమై మాటల యుద్దం చోటు చేసుకొంది.
Recommended Video


శాసనమండలిలో బిజెపి, టిడిపి ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్దం
ఆంధ్రప్రదేశ్‌లో అధికార మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రత్యేక హోదా అంశంపై ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బుధవారం శాసనమండలిలో టీడీపీ, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తమపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు. బిజెపి విమర్శలకు టిడిపి కౌంటరిచ్చింది. ఏపీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు.

టిడిపిపై మాధవ్ విమర్శలు
టీడీపీ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటున్నారు ఎప్పుడు ఇవ్వలేదో చెప్పమనండి. ఎయిమ్స్ పనిజరగడం లేదని టీడీపీ అధికార వెబ్‌సైట్‌లో తప్పుడు రాతలు రాస్తున్నారని మాధవ్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి బాకీ లేదని మాధవ్ తేల్చి చెప్పారు.

ఎన్నికల కోసమే స్పిల్ వే పనులు
2019 ఎన్నికల కోసమే పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనులను చేపట్టారని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ టిడిపిపై విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్నారు. ఏపీకి నిధుల కేటాయింపు విషయమై తామన్నీ నిజాలే చెబుతామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.

ఏపీపై కేంద్రం పోలీసింగ్ చేస్తోంది
బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలపై టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిదులను కేటాయించడం లేదన్నారు..ఇది రాజకీయ ధర్మమా, మిత్ర ధర్మమా? ఏపీ ప్రభుత్వం అడిగిన ప్రతివిషయాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అహ్మదాబాద్, ముంబై మెట్రోకు వేల కోట్లు కేటాయిస్తారు. అమరావతి మెట్రోకు మాత్రం నిధులు కేటాయించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం పోలీసింగ్ చేస్తోందని మాణిక్యవరప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications