జగన్‌, పవన్‌కు ఢిల్లీ నుంచి స్క్రిప్ట్‌: మంత్రి నారాయణ

నెల్లూరు:ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్క్రిప్ట్ ఢిల్లీ నుంచి వస్తోందని మంత్రి నారాయణ ఆరోపించారు. ఆదివారం ఆయన నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

విభజన హామీలు అమలుచేయకుండా బీజేపీ మోసం రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలకు తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత లేదని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.

War of words between TDP,YCP Leaders

కాంగ్రెస్‌-టీడీపీ కాంబినేషన్ 420-840:బొత్స

మరోవైపు కాంగ్రెస్ తో టిడిపి కలయికపై వైసిపి నేత బొత్స సత్యనారాయణ వ్యంగాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్, టీడీపీ కలయిక 420..840 లాంటిదని బొత్స ఎద్దేవా చేశారు.

ఆదివారం ఆయన విశాఖపట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీని రక్షించుకునేందుకే కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారని విశ్లేషించారు. రాష్ట్రంలో చంద్రబాబు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం అందరి కంటే ముందు పోరాడింది తమ వైఎస్ఆర్ సీపీనేనని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు.

War of words between TDP,YCP Leaders

అలాగే ప్రతిపక్ష నేత జగన్‌పై దాడిని ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు ఎందుకు ఖండించలేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జగన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు కాల్‌డేటా బయటపెట్టాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+