బాబు తొలి సంతకంపై అంబటి, కోటి అడిగిన జగన్‌పై తోట

తొలి సంతకం పవిత్రతను, విశ్వసనీయతను చంద్రబాబు నాయుడు మంటగలిపారన్నారు. తొలి సంతకం అంటే మరుక్షణం నుంచి అమల్లోకి రావాలన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇచ్చిన మాటను నిలుపుకోవాలన్నారు.
జగన్ దోచుకున్నది ఇస్తే: తోట
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నిప్పులు చెరిగారు. ప్రజల మరణాలను కూడా రాజకీయం చేసే దుస్థితికి జగన్ చేరుకున్నారన్నారు.
జగన్ చెప్పినట్లుగా కోటీ రూపాయల పెద్ద మొత్తంలో నష్ట పరిహారం ఇవ్వడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. తాను దోచుకున్న అవినీతి డబ్బులో నుంచి కోటి రూపాయల చొప్పున ఆయన నష్ట పరిహారం ఇస్తే అందరూ సంతోషిస్తారని ఎద్దేవా చేశారు. కాగా, గెయిల్ బాధితులకు కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని జగన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications