వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీతో కటీఫ్‌కు తొలి అడుగు: హోదా- వెంకయ్యపై బీజేపీ సేఫ్ సైడ్ ప్లాన్?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/హైదరాబాద్: కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడును బీజేపీ ఉపరాష్ట్రపతిగా పంపించింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వెళ్లడం ఆయనకు ఇష్టం లేదు. కానీ పార్టీ నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉన్నారు.

కేంద్రం ఎలా మోసగించిందంటే: వివరాలతో సహా మోడీకి కేశినేని నాని షాక్, ఎంపీలకూకేంద్రం ఎలా మోసగించిందంటే: వివరాలతో సహా మోడీకి కేశినేని నాని షాక్, ఎంపీలకూ

ఇప్పుడు, ప్రత్యేక హోదా అంశం మరోసారి ఏపీలో వేడి రాజేస్తోన్న నేపథ్యంలో వెంకయ్యను బీజేపీ కావాలనే తప్పించిదా? ఇది ఆయనకు లాభం చేకూర్చేందుకా? లేక మరేదైనా ఉందా అనే చర్చ సాగుతోంది.

వెంకయ్యకు ప్రమోషన్ వెనుక

వెంకయ్యకు ప్రమోషన్ వెనుక

2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధాన అంశం కానుంది. ఈ అస్త్రంతోనే టీడీపీ, జనసేన, వైసీపీలు ఎన్నికలకు వెళ్లనున్నాయి. బీజేపీ మాత్రం ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇచ్చామని చెప్పేందుకు సిద్ధంగా ఉంది. దీనిని పక్కన పెడితే వెంకయ్యకు ప్రమోషన్ వెనుక ఏమైనా ఉందా అనే చర్చ సాగుతోంది.

 అలా రాజీనామా చేసే పరిస్థితి?

అలా రాజీనామా చేసే పరిస్థితి?

వెంకయ్య నాయుడు తెలుగువాడు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజీనామాకు ఏపీ వ్యాప్తంగా డిమాండ్‌లు వినిపించేవని బీజేపీ భావించి ఉంటుందని అంటున్నారు. అంతెందుకు, ప్రస్తుతం ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పటికీ కొందరు ఆయన డిమాండ్ చేయాలంటున్నారు. ఇక కేంద్రమంత్రిగా ఉంటే ఈ డిమాండ్ తీవ్రంగా ఉండేదని భావిస్తున్నారు.

 ముందస్తు జాగ్రత్తనా?

ముందస్తు జాగ్రత్తనా?

నాడు తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు కూడా రాజీనామా చేశారు. కిషన్ రెడ్డి రాజీనామా చేయకపోవడాన్ని టీఆర్ఎస్ గతంలో పలుమార్లు ప్రస్తావించింది. ఇప్పుడు హోదా కోసం కూడా ఏపీలో ఉద్యమిస్తారని భావించిన బీజేపీ.. ముందస్తుగా ఆయనను కేంద్రమంత్రి పదవి నుంచి పక్కన పెట్టి ఉంటుందని అంటున్నారు.

ఇదొక్కటే కారణం కాదు కావొచ్చు

ఇదొక్కటే కారణం కాదు కావొచ్చు

అయితే, ఈ ఒక్క కారణంతో మాత్రమే అలా చేయదని, కానీ ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు. రాజ్యసభలో చైర్మన్‌గా పార్లమెంటరీ వ్యవహారాలు బాగా అవగాహన ఉన్న వారు కావాలని బీజేపీ భావించడం అసలైన కారణంగా చెబుతారు.

 టీడీపీ-బీజేపీ కటీఫ్‌కు అక్కడే అడుగు

టీడీపీ-బీజేపీ కటీఫ్‌కు అక్కడే అడుగు

అంతేకాకుండా, టీడీపీ అధినేత చంద్రబాబుకు వెంకయ్య సన్నిహితుడు. ఈ కారణంగానే ఏపీలో బీజేపీ-టీడీపీ పొత్తు కొనసాగడం, కమలం ఎదగకపోవడానికి కారణంగా కొందరు భావించారు. వెంకయ్య వల్ల పనులు కూడా జరిగాయని అంటారు. ఆయన ఉపరాష్ట్రపతిగా వెళ్లినప్పుడే బీజేపీ-టీడీపీ మధ్య దోస్తీకి ఆరంభమని చాలామంది భావించారు.

English summary
Was Bharatiya Janata Party safeside plan on Venkaiah Naidu?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X