ఫైల్ విసిరేసి, గంటాకు చంద్రబాబు క్లాస్?, సీఎంకు అమిత్ షా ఫోన్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంత్రి గంటా శ్రీనివాస రావుకు క్లాస్ పీకారని తెలుస్తోంది. గంటా పని తీరు పైన ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. తన శాఖ అయిన విద్యాశాఖకు సంబంధించి ఓ నివేదికను సీఎంకు తాజాగా గంట సమర్పించారు.

దానిని చంద్రబాబు విసిరేశారని తెలుస్తోంది. కాగితాల్లో ఏమిటి, పని చేసి చూపాలని క్లాస్ పీకినట్టు కూడా ప్రచారం సాగుతోంది. గత వారంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిన సమయంలో విద్యాశాఖకు చెందిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కూడా చూపవద్దని చంద్రబాబు ఆదేశించారని అంటున్నారు.

ఆ శాఖలో కార్యదర్శి హోదాలో ఉన్న సిసోడియా ఆకస్మిక బదిలీ విషయంలో మంత్రి గంటా పైన చంద్రబాబు అసంతప్తిగా ఉండటమే కారణమని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలి బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల విషయంలో జరిగిన అవకతవకలు, గందరగోళంపై కూడా ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.

Was Chandrababu takes class to Ganta Srinivas Rao?

చంద్రబాబుకు అమిత్ షా ధన్యవాదాలు

చంద్రబాబుకు బీజేపీ బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బుధవారం ఫోన్ చేశారు. తమ పార్టీ అభ్యర్థి సురేశ్ ప్రభుకు రాజ్యసభ సీటిచ్చినందుకు ఆయన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. రాజ్యసభ సీటిచ్చినందుకు కేవలం థ్యాంక్స్ చెప్పేందుకే చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేశారు.

ఈ మేరకు నిన్న సుదీర్ఘంగా కొనసాగిన కేబినెట్ భేటీలో భాగంగా ఈ అంశాన్ని చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు తెలిపారు.

దేశం మొత్తం మీద బీజేపీ కేవలం ఏపీ వద్ద మాత్రమే రాజ్యసభ సీటు తీసుకుందని, అన్నిచోట్లా పార్టీ బలంతోనే సీట్లను సాధించుకుందని, అమిత్ కూడా ఇదే విషయం చెప్పారని, ఇదే సందర్భంగా నేను కేంద్రం వద్ద పెండింగులో ఉన్న ఏపీ సమస్యల గురించి ప్రస్తావించానని, ఓసారి ఢిల్లీకి వస్తే కలిసి కూర్చుని మాట్లాడుకుని ప్రధాని మోడీ వద్ద స్పష్టత తీసుకుందామని అమిత్ షా చెప్పారని చంద్రబాబు మంత్రులతో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+