జేసీ ఎఫెక్ట్.. బెదిరిస్తే ఇస్తారా: యామినీ హెచ్చరిక, కలెక్టర్‌కు దండంపెట్టి ఏడ్చిన టిడిపి మహిళా నేత

అనంతపురం జిల్లాలో అధికార పార్టీలో నీటి గొడవ రాజుకుంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా చేస్తానని హెచ్చరించి, చాగల్లుకు నీరు తెప్పించుకున్నారు. జీవో విడుదల చేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చ

అనంతపురం: అనంతపురం జిల్లాలో అధికార పార్టీలో నీటి గొడవ రాజుకుంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా చేస్తానని హెచ్చరించి, చాగల్లుకు నీరు తెప్పించుకున్నారు. జీవో విడుదల చేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు.

టిడిపిలో నీటి చిచ్చు

టిడిపిలో నీటి చిచ్చు

కానీ, ఈ నీటి చిచ్చు అనంతరం అధికార పార్టీలోనే విభేదాలు తీసుకు వచ్చింది. సోమవారం శింగనమల ఎమ్మెల్యే యామినీ బాల ఆందోళనకు దిగారు. తమ నియోజకవర్గానికి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Recommended Video

    JC ready to resign as Lok Sabha MP ఎంపీగా ఫెయిలయ్యా, రాజీనామా చేస్తున్నా | Oneindia Telugu
    ఎమ్మెల్యే నిరసన ర్యాలీ

    ఎమ్మెల్యే నిరసన ర్యాలీ

    ఎమ్మెల్యే యామినీ బాల రైతులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. తమకు నీరు ఇవ్వాలని వినతిపత్రం అందించారు. అంతకుముందే సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో అక్కడ ఆందోళన జరుగుతోంది. ఎమ్మెల్యే తమకు మద్దతివ్వాలని వారు డిమాండ్ చేశారు.

    న్యాయం జరుగుతుందని ఆశలు

    న్యాయం జరుగుతుందని ఆశలు

    ఈ సమస్య సున్నితమైన, తీవ్రమైన సమస్య అని ఎమ్మెల్యే యామినీ బాల ఈ సందర్భంగా అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు చెప్పామన్నారు. కృష్ణా, గోదావరి నీటిని మన జిల్లాకు చంద్రబాబు రప్పించారన్నారు. నీటి విషయంలో తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామన్నారు.

    బెదిరిస్తే నీరు ఇస్తారా?

    బెదిరిస్తే నీరు ఇస్తారా?

    చాగల్లుకు నీరు ఇవ్వాలని లేదంటే రాజీనామా చేస్తానని జెసి దివాకర్ రెడ్డి ఇటీవల హెచ్చరికలు జారీ చేసి, నీరు రప్పించుకున్నారు. దీనికి ఎమ్మెల్యే యామినీ బాల, ఎమ్మెల్సీ శమంతకమణి కూడా కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా బెదిరిస్తే నీటిని విడుదల చేసేస్తారా? అసలైన ఆయకట్టుదారులమైన తమ సంగతి ఏమిటని? మేం ఇద్దరం ప్రజాప్రతినిధులం ఉన్నామని, మేమూ రాజీనామా చేయడానికి వెనకాడమని శమంతకమణి, యామినీబాల కలెక్టర్‌కు తెలిపారు.

    కలెక్టర్‌కు చేతులు జోడించి కంటతడిపెట్టిన టిడిపి నేత

    కలెక్టర్‌కు చేతులు జోడించి కంటతడిపెట్టిన టిడిపి నేత

    మూడేళ్లుగా నీరిస్తామని చెప్పి, చివరకు చేతులెత్తేస్తున్నారనీ, రైతులకు సమాధానం చెప్పలేక పోతున్నామని వారు అన్నారు. ఎమ్మెల్సీ శమంతకమణి రెండు చేతులు జోడించి కలెక్టరుకు నమస్కరిస్తూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.

    శింగనమల నాయకుల ఆందోళన

    శింగనమల నాయకుల ఆందోళన


    తమకు రావాల్సిన నీరు రావడం లేదని, అన్యాయం జరుగుతోందని శింగనమల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాగల్లుకు ఇప్పటి వరకు నీటి కేటాయింపు లేదు. అయినా నీటిని విడుదల చేయడం శింగనమల రైతులకు ఆగ్రహం తెప్పించింది. వీరికి టిడిపి నేతలు కూడా జత కలవక తప్పలేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+