మళ్లీ ఏపీ సచివాలయంలో మంత్రుల ఛాంబర్లోకి వర్షపు నీరు! ఊడిపడ్డ సీలింగ్ పెచ్చులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుసున్న వర్షాలకు ఏపీ సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లలోకి నీరు వచ్చి చేరింది.
భారీ వర్షాలకు సీలింగ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్‌రెడ్డి, దేవినేని ఉమ ఛాంబర్‌ల్లో సీలింగ్ ఊడిపడి, ఏసీల్లోకి వర్షపు నీరు వచ్చిచేరింది. 4, 5వ బ్లాకుల్లోని పలు సెక్షన్లలో సీలింగ్ ఊడిపడింది.

Recommended Video

ఆంధ్రాలో ఎగిసిపడుతున్న సముద్ర అలలు...!
అసెంబ్లీ బిల్డింగ్‌లోనూ పలు చోట్ల సీలింగ్ ఊడిపోయి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. లీకేజీతో అసెంబ్లీ మొదటి అంతస్తులోని రిపోర్టింగ్ సెక్షన్‌లోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. గతంలో ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్‌లోకి వర్షం నీరు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు వాటికి మరమ్మతులు చేయించారు.












Click it and Unblock the Notifications