వాటర్ ట్యాక్సీలు: అమరావతిలో కొత్త రవాణా వ్యవస్ధ
హైదరాబాద్: నవ్యాంధ్ర నూతన రాజధానిని భారతదేశ గేట్ వేగా నిలపాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. అందులో భాగంగానే రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రతిదీ విభిన్నంగా ఉండేలా ప్రయ్తత్నిస్తున్నారు. సింగపూర్ ప్రతినిధి బృందం ఇప్పటికే అందజేసిన సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌పై బుధవారం మంత్రి వర్గం విస్తృతంగా చర్చించిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో కొత్త రవాణా వ్యవస్ధ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. నవ్యాంధ్ర రాజధానిలో బస్సు, రైలుతో పాటు వాటర్ ట్యాక్సీల వ్యవస్ధను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారట. రాజధాని అమరావతిని కృష్ణా నదికి అభిముఖంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా కృష్ణా నది నుంచి ఓ పాయను విడదీసి దానిని అమరావతి మధ్య నుంచి తీసుకువెళుతూ చివరకు ఆ పాయను మళ్లీ నదిలో కలపనున్నారు. నగరంలో ప్రవహించే ఈ పాయలోనే వాటర్ ట్యాక్సీలు ప్రయాణం సాగించనున్నాయి.

రైల్వే, బస్ స్టేషన్ల మాదిరే వాటర్ ట్యాక్సీ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచారని సమాచారం. మిగిలిన రెండు ట్రాన్స్‌పోర్టు వ్వవస్ధలకు అనుసంధానంగానే వాటర్ ట్యాక్సీ ట్రాన్స్‌పోర్టు కూడా పని చేస్తుందట.
ఇలాంటి వాటర్ ట్యాక్సీ ట్రాన్స్‌పోర్టు వ్వవస్ధ ఇంత వరకూ విదేశాల్లోనే కానీ, మన దేశంలో ఎక్కడా లేదు. దీంతో తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ ట్యాక్సీ ట్రాన్స్‌పోర్టు వ్వవస్ధను అందుబాటులోకి తీసుకురానున్నారు.












Click it and Unblock the Notifications