వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలోనే ఓ పార్టీకి మద్దతు: కాపు నేత ముద్రగడ ప్రకటన;జనసేనకే అంటున్న రాజకీయ పరిశీలకులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

త్వరలోనే ఓ పార్టీకి మద్దతు: కాపు నేత ముద్రగడ ప్రకటన | జనసేనకే అంటున్న రాజకీయ పరిశీలకులు..!!

తిరుపతి:కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. కాపు సంఘాల తరుపున తామంతా త్వరలోనే ఓ పార్టీకి మద్దతు ప్రకటించనున్నట్లు ముద్రగడ వెల్లడించారు.

గురువారం తిరుపతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమకు ఎవరైతే న్యాయం చేస్తారో వారికే తమ మద్దతు ఇస్తామని ముద్రగడ స్పష్టం చేశారు.
ఈ విషయంపై తమ కుల పెద్దలతో మాట్లాడిన తరువాత నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని ముద్రగడ వెల్లడించారు. మరోవైపు ముద్రగడ నేతృత్వంలోని కాపు సంఘాలు మద్దతు ప్రకటించేది జనసేన పార్టీకేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 We announce our support to a Party soon:Kapu agitation leader Mudragada Padmanabham

గురువారం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ..."మా ఉద్యమానికి న్యాయం చేసేవారికే మా మద్దతు ఉంటుంది...త్వరలోనే 13 జిల్లాల కుల పెద్దలతో సమావేశమై ఓ రాజకీయ పార్టీలో చేరతాం...లేనిపక్షంలో ఏ పార్టీ నీడలోనైనా ఉండి మా డిమాండ్‌ను సాధించుకుంటాం...అది ఏ పార్టీ అన్న విషయాన్ని త్వరలోనే చెబుతాం"...అని ప్రకటించారు.

కాపు జాతికి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని...కేవలం కంటితుడుపుగా బిల్లు ప్రవేశపెట్టి చేతులు దులుపుకొన్నారని ముద్రగడ దుయ్యబట్టారు. మరో పార్టీ కాపులకు రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తామని చెప్పిందని...మేమేమైనా పశువులమా...మాది అమ్ముడుపోయే జాతా...మిగిలిన వారంతా నీతిపరులా?...అని ముద్రగడ ప్రశ్నించారు.

ముద్రగడ తాజా ప్రకటన ఊహించిందేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటీవలి కాలంలో ఎపిలో జనసేన పొలిటికల్ గ్రాఫ్ పెరుగుతుండటం, టిడిపి, వైసిపి లను ముద్రగడ తప్పుబట్టడాన్ని గమనిస్తే ముద్రగడ జనసేనకే మద్దతు ప్రకటించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఆయన నిర్ణయం అదే అయినా తప్పుబట్టవలసింది ఏమీ లేదని...ఒక స్పష్టమైన లక్ష్యం తో ఉన్నప్పుడు ఆ లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుందో అందుకు సహకరించే పార్టీకి మద్దతు ఇవ్వడం ప్రస్తుత రాజకీయాల్లో సహజమేనన్నారు.

English summary
Tirupathi:Kapu agitation leader Mudragada Padmanabham was made sensational comments. On behalf of the Kapu communities, he said they would announce their support for a party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X