వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బాబుని నమ్మి మోసపోయా': ఇదేంటి.. ముద్రగడ లేఖ దారుణంగా ఉంది: నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్ని తాము మోసపోయామని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం విశాఖలో ఆరోపించారు. తనకు దీక్ష సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు.

తద్వారా తాము చంద్రబాబు చేతిలో మరోసారి ఓడిపోయామని అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాపులు టిడిపి - బిజెపికి మద్దతు పలికారు. ఇటీవల ఆయన దీక్ష చేసినప్పుడు ప్రభుత్వం హామీలు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఆయన బుధవారం విశాఖలో స్పందించారు. ప్రభుత్వ తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. కాపు రుణాలు పేరుతో పచ్చ చొక్కాల వారికే వాటిని ఇస్తున్నారని చెప్పారు. తాము మళ్లీ రోడ్డు ఎక్కే పరిస్థితులు తేవద్దని ముద్రగడ సీఎం చంద్రబాబును హెచ్చరించారు.

We are cheated by Government: Mudragada

కాపు సభకు వచ్చిన వారిని కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. తాను ఏ రాజకీయ పార్టీలో లేనని, అలాగే ఏ కులానికి వ్యతిరేకం కాదని చెప్పారు. తమను రోడ్డెక్కే పరిస్థితి గతంలో తీసుకొచ్చారని, మళ్లీ తీసుకు రావొద్దన్నారు. నాలుగైదు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

తన కాపు సామాజిక వర్గం కోసం తాను మరోసారి రోడ్డెక్కేందుకు సంశయించనని చెప్పారు. నా జీవితం మా సామాజిక వర్గం కోసమే అన్నారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం మళ్లీ పాత పాట పాడుతోందన్నారు. బీసీ కమిషన్లో మెంబర్ వేస్తామని పట్టించుకోలేదన్నారు. ముద్రగడ ముఖ్యమంత్రి లేఖ రాశారు.

ముద్రగడ లేఖను తప్పుపబట్టిన మంత్రులు

కాగా, బుధవారం సాయంత్రం ముద్రగడ రాసిన లేఖను మంత్రులు తప్పుబట్టారు. ఆయన రాసిన లేఖను మంత్రి నారాయణ చదివి వినిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రస్తావిస్తూ రాసిన కొన్ని వాక్యాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడ్డారు. ఒక సీనియర్ నేత అయిన ముద్రగడ ఈ విధమైన రాతలు రాయడం సబబు కాదన్నారు.

'ముఖ్యమంత్రికి ముద్రగడ పద్మనాభం గారు 1.03.2016న మూడు పేజీలు ఉన్న ఒక లేఖ రాశారు. ఒక ముఖ్యమంత్రికి రాయాల్సిన విధానంలో ఈ లేఖ లేదు. ఆయన నోటికొచ్చినట్లు లేదా జగన్ డిక్టేట్ చేస్తే రాసినట్లుగా ఉంది.

కాపులకు ఏవైతే చేస్తామని ప్రభుత్వం చెప్పిందో నూటికి నూరుపాళ్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పనులు మొదలు పెట్టింది. రెండురోజుల క్రితం ఏలూరులో కాపు కార్పొరేషన్ ద్వారా రూ.192 కోట్లను పంపిణీ చేసింది. అన్ని జిల్లాల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇంతలోనే తొందరపడితే ఎట్లా?.

ముఖ్యమంత్రికి రాసిన ఈ లేఖలో కొన్ని వాక్యాలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. ఈ దరిద్రపు జాతి పూర్తిగా అంతరించిపోవాలన్నదే మీ కోరికగా కనిపిస్తోందని రాశారని మంత్రి నారాయణ చెప్పారు. కాపులంటే దరిద్రపు జాతా?, కాపుల్లో పేదలున్నారు కానీ, దరిద్రులు కాదన్నారు.

ఎంత కాలం నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారని ముద్రగడను ప్రశ్నించారు. పదాలు రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవద్దా అని ప్రశ్నించారు. మీరు కాపు వర్గానికి చెందిన వారు, నేనూ కాపు వర్గానికి చెందిన వాడినే అని, ఈ రాష్ట్రంలో కాపులకు మేలు ఏవిధంగా జరుగుతుందో చూడాలని హితవు పలికారు.

English summary
Kapu leader and Former Minister Mudragada Padmanabham said on Wednesday that Government cheated us.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X