అసెంబ్లీకి తీర్మానం రాదు, కిరణ్‌ను మార్చబోము: డిగ్గీ
న్యూఢిల్లీ: అసెంబ్లీకి తీర్మానం రాదని ముసాయిదా బిల్లు మాత్రమే వస్తుందని అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చబోమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం అన్నారు. న్యూఢిల్లీలో ఆయనను విలేకరులతో విభజన, కిరణ్ కుమార్ రెడ్డి విషయమై స్పందించారు.
అసెంబ్లీకి తెలంగాణపై తీర్మానం రాదని చెప్పారు. ముసాయిదా బిల్లు మాత్రం వస్తుందన్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెసు పార్టీకి విశ్వాసపాత్రుడని, ఆయన కాంగ్రెసు కుటుంబ సభ్యుడని అయితే విభజనతో వచ్చే సమస్యలను ఆయన తమ దృష్టికి తెచ్చే ప్రయత్నాలు చేశారని అభిప్రాయపడ్డారు.

ఈ రోజు సాయంత్రం జరగనున్న సమన్వయ కమిటీ భేటీ సమన్వయం కోసమే తప్ప మరెందుకో కాదన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం మేరకే తాము విభజనపై ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ విషయంలో ఇతర ఏ పార్టీలు వెనక్కి వెళ్లినా తాము మాత్రం యూ టర్న్ తీసుకునేది లేదని చెప్పారు. సిడబ్ల్యూసి నిర్ణయానికి కిరణ్ ఒప్పుకున్నారని, కిరణ్, ఆయన కుటుంబ సభ్యులు పార్టీకి విశ్వాసపాత్రులన్నారు. సమన్వయ కమిటీలో ఏం జరుగుతుందో చూడాలన్నారు.
నెలాఖరులోగా ముసాయిదా బిల్లు వస్తుందన్నారు. రాయల తెలంగాణ అంశాన్ని మంత్రుల బృందం(జివోఎం) చర్చిస్తుందన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, సిపిఎం పార్టీలు జివోఎంకు నివేదికలు ఇవ్వడం ద్వారా సీమాంధ్ర ప్రజల సమస్యలను చెప్పే అవకాశాన్ని కోల్పోవద్దని సూచించారు.












Click it and Unblock the Notifications