వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కాంగ్రెస్‌లో ఉంటే తెలంగాణ ఏర్పడేది కాదేమో, వ్యూహల్లో బాబు దిట్ట: మేకపాటి

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైఎస్ జగన్‌కు నాయకత్వ లక్షణాలున్నాయని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకొనేపనిలోనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఉన్నారని రాజమోహన్ రెడ్డి ఆరోపించారు.

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల ఓటు మాకే: ఆదిరాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల ఓటు మాకే: ఆది

2019 ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండకపోవచ్చని మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఎంపీలు రాజీనామా చేస్తే బిజెపికే లాభం, కేంద్రంపై అంచెలంచెల పోరుకు బాబు ప్లాన్ఎంపీలు రాజీనామా చేస్తే బిజెపికే లాభం, కేంద్రంపై అంచెలంచెల పోరుకు బాబు ప్లాన్

ఏపీకి ప్రత్కేక హోదా అంశంపై, వైసీపీ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఓ తెలుగు న్యూస్ చానెల్ ఇంటర్వ్యూ చేసింది.

పురంధరేశ్వరీకి టిడిపి కౌంటర్: రెవిన్యూలోటుకు కొత్త నిర్వచనంపురంధరేశ్వరీకి టిడిపి కౌంటర్: రెవిన్యూలోటుకు కొత్త నిర్వచనం

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ రాజీలేని పోరాటం చేస్తోందని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. జగన్‌ను చూస్తే చంద్రబాబునాయుడు భయపడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

జగన్ కాంగ్రెస్‌లో ఉంటే పరిస్థితి మరోలా ఉండేది

జగన్ కాంగ్రెస్‌లో ఉంటే పరిస్థితి మరోలా ఉండేది

కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ జగన్ కొనసాగితే పరిస్థితి మరోలా ఉండేదని వైసీపీ నేత నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి జగన్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే మరోలా ఆలోచించేదన్నారు. రాష్ట్ర విభజన సమస్య తెరమీదికి వచ్చి ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, జగన్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాతే ఈ పరిస్థితులు వచ్చాయనే అభిప్రాయాన్ని మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యక్తం చేశారు.

జగన్‌కు నాయకత్వ లక్షణాలున్నాయి.

జగన్‌కు నాయకత్వ లక్షణాలున్నాయి.

వైఎస్ జగన్‌కు నాయకత్వ లక్షణాలున్నాయని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. తాను ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించానని ఆయన చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహ నాయకత్వ లక్షణాలు జగన్ లో చూశానని రాజమోహన్ రెడ్డి గుర్తు చేసుకొన్నారు. నాయకత్వ లక్షణాలు జన్మతహ వస్తాయని రాజమోహన్ రెడ్డి చెప్పారు.

నా కంటే తక్కువ అర్హులు కూడ సీఎం అయ్యారు

నా కంటే తక్కువ అర్హులు కూడ సీఎం అయ్యారు

రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు ఉన్నప్పటికీ తాను ఎంపీగా కొనసాగుతున్నానని వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. కొన్ని విషయాల్లో తనకంటే తక్కువ అర్హతలున్నవారు ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారని కూడ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. నాయకులుగా ఎన్నిక కావడానికి కొందరికి కొన్ని అవకాశాలు కూడ కలిసివస్తుంటాయని రాజమోహన్ రెడ్డి చెప్పారు.

వ్యూహల్లో బాబు దిట్ట

వ్యూహల్లో బాబు దిట్ట

రాజకీయ వ్యూహల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అపర చాణక్యుడని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహలను రచించడంలో బాబును మించినవారు లేరని మేకపాటి రాజమోహన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే కేంద్రంలో బాబుకు పరపతి లేకుండాపోయిందని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు.

ప్రజలకు అండగా ఉండేందుకు రాజీనామాలు

ప్రజలకు అండగా ఉండేందుకు రాజీనామాలు

ఏపీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకుగాను తాము రాజీనామాలు చేయాలని భావిస్తున్నామని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు తదితర అంశాలను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో రాజీనామాలను చేయనున్నట్టు ఆయన చెప్పారు.2019 ఎన్నికల్లో తమకు 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదాను ఇచ్చేందుకు కృషి చేస్తామని రాజమోహన్ రెడ్డి చెప్పారు.

English summary
Ysrcp leader Mekapati Rajamohan Reddy said Sonia Gandhi would not split the AP state if Jagan continued in the Congress party. A Telugu channel interviewed him on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X