అమరావతి:వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తనకు నమ్మకద్రోహం చేశారని వైసీపీ నుంటి ఇటీవలే టిడిపిలో చేరిన అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి చెప్పారు.పార్టీ విషయమై తాను నిజాలను నిర్భయంగా చెప్పినందుకే తనను దూరం పెట్టారని గురునాథ్ రెడ్డి ఆరోపించారు.
జగన్‌కు షాక్: బాబును కలిసిన గురునాథ్‌రెడ్డి, ప్రభాకర్ చౌదరి ఏం చేస్తారు?
సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత వైసీపీలో ఉన్న కొనసాగిన గురునాథ్ రెడ్డి ఇటీవలనే టిడిపిలో చేరారు. గురునాథ్ రెడ్డి టిడిపిలో చేరడాన్ని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకించారు.
జగన్‌కు గుర్నాథర్ రెడ్డి షాక్: మిస్సమ్మ బంగ్లా కారణమా?
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు విశ్వాసంగా తాము కొనసాగిన తమను జగన్ ఎందుకు దూరం పెట్టారో అర్థం కాలేదన్నారు. మిస్సమ్మ బంగ్లా విషయంలో సిఐడి నివేదిక భయంతోనే టిడిపిలో చేరారనే విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. ఎన్ టీ వి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గురునాథ్ రెడ్డి పలు విషయాలను ఆయన వెల్లడించారు.

జగన్ నాకు నమ్మకద్రోహం చేశారు
అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి వైసీపీని వీడి టిడిపిలో చేరారు. వైఎస్ జగన్ వెంటనే నడిచిన తనకు జగన్ నమ్మకద్రోహం చేశారని గురునాథ్ రెడ్డి ఆరోపించారు. తాను ఏనాడూ జగన్ ను నమ్మకద్రోహం చేయలేదని గురునాథ్ రెడ్డి చెప్పారు. పార్టీ విషయంలో నిజాలను నిర్బయంగా చెప్పడంతోనే జగన్ తనను దూరం పెట్టారని గురునాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఎమ్మెల్యేగా ఉన్నా పార్టీని వీడేవాడిని
పార్టీని బలోపేతం చేసే విషయంలో జగన్ తీసుకొంటున్న నిర్ణయాలపై తమకు అభ్యంతరాలున్నాయని గురునాథ్ రెడ్డి చెప్పారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తాము చేసిన సూచనలను జగన్ పట్టించుకోలేదని గురునాథ్ రెడ్డి చెప్పారు. గత ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే జగన్ ఇదే విధానాలను కొనసాగిస్తే పార్టీని వీడే వాడినని గురునాథ్ రెడ్డి గుర్తు చేశారు.

నంద్యాలలో వైసీపీ ఓడిపోతోందని తెలుసు
నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో ఆనాడు వైసీపీ తనకు కేటాయించిన డివిజన్లలో పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహించానని ఆయన చెప్పారు. ప్రచారం సమయంలోనే వైసీపీ ఓటమి ఖాయమని తేలిందని గురునాథ్ రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని జగన్ కు ముందే చెప్పామని ఆయన గుర్తు చేశారు. అయితే నంద్యాల ఉప ఎన్నికల కంటే ముందే తాను పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నానని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని కూడ జగన్ దృష్టికి తీసుకొచ్చానని ఆయన చెప్పారు.

వైఎస్ఆర్ చెబితేనే మిస్సమ్మ బంగ్లాను కొన్నాం
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే వైఎస్ సూచిస్తేనే మిస్సమ్మ బంగ్లా స్థలాన్ని కొనుగోలు చేసినట్టు గురునాథ్ రెడ్డి చెప్పారు. అన్ని విషయాలను చూసుకొన్న తర్వాతే ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. మిస్సమ్మ బంగ్లా కేసులో సిఐడి నివేదిక తనను తప్పు పట్టిన విషయం వాస్తవమేనని చెప్పారు. దీని కొరకే తాను టిడిపిలో చేరాలనే నిర్ణయం తీసుకొన్నాననే ప్రచారం సరైంది కాదన్నారు.

పరిటాల రవితో మంచి సంబంధాలు
పరిటాల రవి కుటుంబంతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని గురునాథ్ రెడ్డి చెప్పారు. అయితే రాజకీయంగా రెండు కుటుంబాలు వేర్వేరు పార్టీల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నారాయణరెడ్డిని తాను లాయర్ ద్వారా లొంగుబాటుకు ప్రయత్నం చేశాననే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆ అవసరం తమకు లేదన్నారు.

ప్రభాకర్ చౌదరితో మాట్లాడే ప్రయత్నం చేశా
అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో మాట్లాడే ప్రయత్నం చేశానని కానీ, సాధ్యం కాలేదని గురునాథ్ రెడ్డి చెప్పారు. అనంతపురం నుండి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తాననే హమీపై టిడిపిలో చేరలేదన్నారు. ఎలాంటి హమీలు లేకుండానే టిడిపిలో చేరినట్టు ఆయన చెప్పారు. అయితే 2019 ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఏం చెబితే ఆ నిర్ణయాన్ని శిరసావహిస్తానని ఆయన చెప్పారు.

బిటెక్ రవికి ఆర్థిక సహయం చేయలేదు
కడప ఎమ్మెల్సీ బిటెక్ రవికి తాను ఆర్థిక సహయం చేశారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు గురునాథ్ రెడ్డి, 2009 ఎన్నికల సమయంలోవైసీపీకి చెందిన కొందరు అభ్యర్థులకు జగన్ సూచన మేరకు తనకు తెలిసిన మిత్రుల ద్వారా ఆర్థికంగా సహయం చేయించినట్టు గురునాథ్ రెడ్డి చెప్పారు. కానీ, ప్రత్యర్థి పార్టీలకు ఏనాడూ ఆర్థికంగా సహయాన్ని అందించలేదని గురునాథ్ రెడ్డి చెప్పారు
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!