వైసీపీపై టిడిపి మరో అస్త్రం: ఆ నివేదిక రాక ముందే జగన్‌పై ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టిడిపి నేతలు మండిపడుతున్నారు.

వ్యక్తులకే ప్రాధాన్యత, ఎవరికీ దక్కని హ్యట్రిక్, సంచలనాలే నంద్యాల చరిత్ర

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఈ నెల 23వ, తేదిన ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికను పురస్కరించుకొని టిడిపి, వైసీపీలు పెద్ద ఎత్తున నంద్యాలలో మోహరించాయి.

నంద్యాల అసెంబ్లీ ఎన్నిక సందర్భంగా ఇటీవల నంద్యాలలో నిర్వహించిన సభలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలను ఈసీ సుమోటోగా తీసుకొని జగన్‌ను వివరణ కోరింది.

వైసీపీకి పీకే సర్వే షాక్: 4 గ్రామాలే కీలకం, జగన్ ప్రచారం వెనుక..

ఈసీకి ఈ విషయమై జగన్ వివరణ ఇచ్చారు. ఈ వివరణ అందినట్టుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. అయితే భన్వర్‌లాల్ తమకు జగన్ వివరణ అందిందని మీడియాకు చెబుతున్న సమయంలోనే జగన్ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు టిడిపి నేతల ఆగ్రహం

జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు టిడిపి నేతల ఆగ్రహం

వైసీపీ చీఫ్ జగన్ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ళుగా ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చని చంద్రబాబును ఉరితీస్తే తప్పేంటని ఆయన ,ప్రశ్నించారు. హమీలను నెరవేర్చాలని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ తీరును ఎండగడుతున్నారు.

కలెక్టర్‌ నుండి నివేదిక ఇంకా అందలేదు

కలెక్టర్‌ నుండి నివేదిక ఇంకా అందలేదు

నంద్యాలలో జరిగిన సభలో చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కర్నూల్ జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు నివేదిక అందలేదు. ఈ నివేదిక అందాల్సి ఉందని భన్వర్‌లాల్ చెప్పారు. ఈ నివేదిక రాగానే జగన్ ఇచ్చిన వివరణను కలిపి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. అయితే మరోసారి జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

జగన్‌పై ఈసీకి ఫిర్యాదు చేయనున్న టిడిపి

జగన్‌పై ఈసీకి ఫిర్యాదు చేయనున్న టిడిపి

ఎన్నికల ప్రచారంలో భాగంగా గోస్పాడు మండలంలో నిర్వహించిన రోడ్‌షో‌లో చంద్రబాబుపై జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఏపీ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. జగన్ వ్యవహరశైలిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గతంలో కూడ ఆయన చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తుచేశారు. చెప్పులతో కొట్టాలన్నారు. నడిరోడ్డులో కాల్చేయాలన్నారు. ఇవాళ ఉరి తీయాలని అన్నారని ఆయన చెప్పారు. ఈ విషయమై ఈసీకి మరోసారి ఫిర్యాదు చేస్తామన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.

ఓటమి భయంతోనే జగన్ వ్యాఖ్యలు

ఓటమి భయంతోనే జగన్ వ్యాఖ్యలు

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఓటమి ఖాయమని తేలిన నేపథ్యంలోనే జగన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బీహర్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడ నేతలు ఈ తరహ వ్యాఖ్యలు చేయలేదని ఆయన అన్నారు. ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
we will complaint against on Ys Jagan said Andhra pradesh Agriculture minister Somireddy chandramohan reddy on Thursday. Ys Jagan controversy statement again on Ap chief minister Chandrababu naidu.
Please Wait while comments are loading...