డిజిటల్ ఇండియాలో ఏపిదే టాప్: చంద్రబాబు(పిక్చర్స్)
హైదరాబాద్: ఐటి రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలుపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఐటి విధానం డిజిటల్ ఇండియాలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెడుతుందని ఆయన చెప్పారు. గురువారం నానక్‌రాంగూడలో నిర్వహించిన నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి సిఎం చంద్రబాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విప్రో వంటి ప్రతిష్టాత్మక సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సెప్టెంబర్ 29న విశాఖపట్నంలో ఐటి ఇంకుబేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఐటీని వాడుకుంటామన్నారు.
విశాఖలో విప్రో ఐటీ సెజ్‌ను ఏర్పాటు చేయబోతోందని, టెక్ మహింద్రా, సమీర్ కంపెనీలు ఏపీలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. సన్‌రైజ్ స్టేట్ అయిన ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఐటీ రంగ ప్రోత్సాహానికి చట్టపరమైన ఇబ్బందులపై నాస్కామ్ దృష్టిపెట్టాలని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు
ఐటి రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలుపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

చంద్రబాబు
ఐటి విధానం డిజిటల్ ఇండియాలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెడుతుందని ఆయన చెప్పారు.

చంద్రబాబు
గురువారం నానక్‌రాంగూడలో నిర్వహించిన నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి సిఎం చంద్రబాబు హాజరయ్యారు.

చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విప్రో వంటి ప్రతిష్టాత్మక సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

చంద్రబాబు
సెప్టెంబర్ 29న విశాఖపట్నంలో ఐటి ఇంకుబేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఐటీని వాడుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications