వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి త్వరలో తీపి కబురు, టిడిపికి బిజెపి షాక్ ఇచ్చే ప్లాన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను విడుదల చేసిందనే విషయమై వివరించాలని బిజెపి ఎంపీలు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై టిడిపి ఎంపీలు చేస్తున్న నిరసనలతో రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని భావించిన బిజెపి నేతలు ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

Recommended Video

TDP-Congress Alliance : Sonia Gandhi's Support To TDP

బిజెపితో తాడోపేడో, నిరసనలు మరింత తీవ్రం: బాబు ఆదేశంబిజెపితో తాడోపేడో, నిరసనలు మరింత తీవ్రం: బాబు ఆదేశం

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేకపోవడంపై పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్, టిడిపి, వైసీపీ ఎంపీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మళ్ళీ పాత పాటే పాడారని ఎంపీలు విమర్శలు గుప్పించారు.

బడ్జెట్ ఎఫెక్ట్: ఎంతో కాలం మోసం చేయలేరు,అరుణ్ జైట్లీతో సుజనా వాగ్వాదంబడ్జెట్ ఎఫెక్ట్: ఎంతో కాలం మోసం చేయలేరు,అరుణ్ జైట్లీతో సుజనా వాగ్వాదం

కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏపీకి నిధుల కేటాయింపు విషయమై సానుకూల సంకేతాలను మాత్రం ఇవ్వలేదు.

అంతా అయిపోయింది, చిన్న చూపు, ఏం చేద్దాం?: టిడిపి ఎంపీలుఅంతా అయిపోయింది, చిన్న చూపు, ఏం చేద్దాం?: టిడిపి ఎంపీలు

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని టిడిపి, బిజెపి మధ్య అగాధం పెరుగుతోంది. అయితే తాడోపేడో తేల్చుకోవాలనే భావనతో కొందరు టిడిపి నేతలున్నారు.

ఏపీకి నిధుల కేటాయింపుపై ప్రజలకు వివరిద్దాం

ఏపీకి నిధుల కేటాయింపుపై ప్రజలకు వివరిద్దాం


కేంద్ర ప్రభుత్వం నుండి ఏపీకి ఇప్పటివరకు వచ్చిన నిదుల విషయాన్ని లెక్కలతో సహ వివరించాలని బిజెపి నేతలు భావిస్తున్నారు.ఏపీకి కేటాయించిన నిధుల విషయాన్ని ఫిబ్రవరి 9వ, తేదిన వివరించనున్నట్టు బిజెపి ఎంపీ గోకరాజు గంగరాజు ప్రకటించారు. వాస్తవానికి టిడిపి నేతలు చేస్తున్న ప్రచారం విషయమై ప్రజలే వాస్తవాలేమిటో తెలుసుకొంటారని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఏపీకి ఇచ్చిన హమీల అమలుపై చర్చలు

ఏపీకి ఇచ్చిన హమీల అమలుపై చర్చలు

ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హమీల విషయమై పార్టీ అధిష్టానంతో చర్చిస్తున్నట్టు బిజెపి ఎంపీ గోకరాజు గంగరాజు ప్రకటించారు. ఏపీకి న్యాయం జరగలేదనడం సరికాదని, విడతల వారీగా కేంద్రం సాయం చేస్తోందని గోకరాజు చెప్పారు. ఆంధ్రుల మనోభావాలకు అనుగుణంగా బీజేపీ ఏపీకి సాయం చేస్తోందన్నారు. ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై అధిష్ఠానంతో చర్చిస్తామని గంగరాజు పేర్కొన్నారు.

ఏపీకి త్వరలో తీపి కబురు

ఏపీకి త్వరలో తీపి కబురు

ఏపీ రాష్ట్రానికి బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపుగా తీపి కబురు వచ్చే అవకాశం ఉందని ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.ఏపీకి బీజేపీ చాలా చేసిందని మంత్రి కామినేని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నీ కేంద్రం నెరవేరుస్తోందని తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోగా కేంద్రం సంతృప్తికర సమాధానం ఇస్తుందని భావిస్తున్నామని కామినేని ఆశాభావం వ్యక్తంచేశారు.

నష్టనివారణ కోసం బిజెపి యత్నం

నష్టనివారణ కోసం బిజెపి యత్నం


టిడిపి చేస్తున్న ప్రచారంతో బిజెపి రాజకీయంగా ఇబ్బంది పడుతోంది. దీంతో టిడిపి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు గాను బిజెపి ప్రజాప్రతినిధులు కేంద్రం నుండి వచ్చిన నిదుల విషయాలను ప్రజలకు వివరిస్తే రాజకీయంగా టిడిపి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే అవకాశం ఉందని బిజెపి నేతలు భావిస్తున్నారు. దరమిలా ఏపీకి ఇచ్చిన నిధుల విషయమై ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు.

English summary
BJP MP Gokaraju Rangaraju said he would explain the funding given to the AP from the Center in the last four years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X